AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలకు చిక్కిన కొండచిలువ

వరంగల్ రూరల్ జిల్లాలో చేపల కోసం వేసిన వలలో భారీ కొండ చిలువ పడింది. కొండచిలువ రావడంతో మత్స్యకారుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

వలకు చిక్కిన కొండచిలువ
Jyothi Gadda
|

Updated on: Sep 28, 2020 | 1:10 PM

Share

వరంగల్ రూరల్ జిల్లాలో చేపల కోసం వేసిన వలలో భారీ కొండ చిలువ పడింది. ఈ సంఘటన ఆదివారం నాడు వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో చోటు చేసుకుంది. చేపల వేటకోసం వేసిన వలలో ఎనిమిది అడుగుల పొడవు ఉన్న కొండచిలువ చిక్కింది. నల్లబెల్లి ఊర చెరువు మత్తడి కింద ప్రవహిస్తున్న వాగులో మత్స్యకారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేపలు పట్టేందుకు వెళ్తున్నారు.

మామూలుగానే చెరువులో వల వేసిన మత్స్యకారులకు వల బరువుగా మారటంతో పైకి లాగి చూడగా..అందులో భారీ కొండచిలువ కనిపించింది. దానిని చూసి భయపడిపోయిన మత్స్యకారులు వెంటనే చెరువు నుంచి బయటకు వచ్చారు. వలలో చిక్కిన కొండ చిలువ గురించి స్థానిక పోలీసులు,అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షలకు వరద నీరు చెరువు లోకి చేరినప్పుడు కొండచిలువ కూడా వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొండచిలువను స్థానిక అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు. వలకు చిక్కిన కొండచిలువను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. మరోవైపు కొండచిలువ రావడంతో మత్స్యకారుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

చికెన్ స్కిన్ Vs స్కిన్ లెస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
చికెన్ స్కిన్ Vs స్కిన్ లెస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించే లోపుగానే..
క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించే లోపుగానే..
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా