శ్రావణి కేసు: ముగిసిన దేవరాజ్, సాయికృష్ణల పోలీస్ కస్టడీ
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులు దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డిల పోలీసుల కస్టడీ ముగిసింది.
Sravani case updates: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులు దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డిల పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు వారిని విచారించిన ఎస్సార్ నగర్ పోలీసులు శ్రావణి నివాసంతో పాటు శ్రీకన్య హోటల్ వద్ద సీన్‌లను రికన్‌స్ట్రక్షన్ చేశారు. అలాగే శ్రావణికి సంబంధించిన కాల్ రికార్డులు, వాట్సాప్ చాటింగ్ గురించి వివరాలను సేకరించారు. కస్టడీ ముగియడంతో ఈ రోజు ఆ ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ఈ కేసులో మరో నిందితుడు, నిర్మాత అశోక్ రెడ్డి ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉండగా.. ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read More:
అధికారిక ప్రకటన.. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ