హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు
బంగారం, వాన, గ్రీకు వీరుడు' వంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి మీరా చోప్రా. ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వరుసకి సోదరి అయిన మీరా.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేస్తోంది. కాగా మంగళవారం సాయంత్రం తన తండ్రిని..

‘బంగారం, వాన, గ్రీకు వీరుడు’ వంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి మీరా చోప్రా. ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వరుసకి సోదరి అయిన మీరా.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేస్తోంది. కాగా మంగళవారం సాయంత్రం తన తండ్రిని బెదిరించిన ఇద్దరు దుండగులు.. ఆయన ఫొన్ ఎత్తుకెళ్లారని ట్వీట్ చేసింది. ఎంతో సురక్షితమని చెప్పుకుంటున్న ఢిల్లీలో ఇలాంటి ఘటన జరగడమేంటని ట్వీట్టర్‌లో ప్రశ్నించింది మీరా చోప్రా.
‘నా తండ్రి బయటికి వెళ్లినప్పుడు.. ఇద్దరు దుండగులు స్కూటర్‌పై వచ్చి కత్తితో బెదిరించి ఫోన్ దోచుకెళ్లారు. ఢిల్లీలోని పోలీస్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఢిల్లీని సురక్షిత ప్రాంతమని ఎలా అనుకోవాలి?’ అంటూ ఆమె ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని, ఢిల్లీ పోలీసులని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. కాగా ఈ విషయంపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే వారి థ్యాంక్స్ చెబుతూ మీర చోప్రా మరో ట్వీట్ చేశారు.
@DelhiPolice my dad was taking a walk in #policecolony. 2 guys came in a scooter, showed knife and snatched his phone. This is how safe you claim delhi to be. @ArvindKejriwal @CPDelhi
— meera chopra (@MeerraChopra) May 5, 2020
Read More:
టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం
బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..