Crime news: చేతిరాత సరిగా లేదని విద్యార్థిని చితకబాదాడు..పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి..
ఇటీవల కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వివిధ కారణాలతో వారిపై ఇష్టమొచ్చినట్లు...
ఇటీవల కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వివిధ కారణాలతో వారిపై ఇష్టమొచ్చినట్లు చేయిచేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కదిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు చేతిరాత సరిగ్గా లేదన్న కారణంతో విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. బాధిత విద్యార్థి ముఖం, శరీరం ఎర్రగా కందిపోయేలా చితకబాదాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
చౌడయ్య కదిరి పట్టణంలో సీనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ఇతని కుమారుడు కృష్ణ చైతన్య కేఎల్‌ఎన్ ఇనిస్టిట్యూట్ అనే ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. అయితే తన చేతిరాత బాలేదన్న కారణంతో శుక్రవారం స్కూల్ కరస్పాండెంట్ రమేష్ చైతన్యను దారుణంగా కొట్టాడు. దీంతో విద్యార్థి తండ్రి చౌడయ్య పోలీసులను ఆశ్రయించాడు. స్కూల్ కరస్పాండెంట్ తన కుమారుడిని చితక బాదారని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
Also Read: