Hyderabad: కొడుకును చంపినోడు కళ్లముందే దర్జాగా తిరుగుతున్నాడని రగిలిపోయాడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..

Hyderabad: వ్యక్తి హత్యకు మాస్టర్ ప్లాన్ వేసిన సుపారీ గ్యాంగ్ ను శంషాబాద్ ఎస్ఒటి బృందం, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శంషాబాద్ డిసిసి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో..

Hyderabad: కొడుకును చంపినోడు కళ్లముందే దర్జాగా తిరుగుతున్నాడని రగిలిపోయాడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..
Arrest
Follow us

|

Updated on: Oct 29, 2021 | 10:07 AM

Hyderabad: వ్యక్తి హత్యకు మాస్టర్ ప్లాన్ వేసిన సుపారీ గ్యాంగ్ ను శంషాబాద్ ఎస్ఒటి బృందం, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శంషాబాద్ డిసిసి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఈ గ్యాంగ్ ను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మండలం చౌటాకూర్ గ్రామానికి చెందిన బేగరి దేవయ్య అనే వ్యక్తికి అదే గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. అయితే వ్యవసాయ భూమి పై కాశన్నగారి సుగుణమ్మ, కాశన్నగారి ఎల్లయ్య తో వివాదం జరగడంతో అది కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో 05-01-2021 రోజున బెంగారి దేవయ్య తన కోడుకు కరుణాకర్ వెంట వస్తుండగా పుల్కల్ గ్రామం వద్దకు రాగానే సుగుణమ్మ, కాశన్నగారి కరుణాకర్, కాశన్నగారి ప్రసాద్, మున్మంద సైదులు, కాశన్నగారి ప్రదీప్, కాశన్నగారి సురేఖ, కాశన్నగారి మణెమ్మ కలిసి ఇద్దరిని మారణాయుధాలతో చితకబాదారు. దీంతో దేవయ్య కుమారుడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులు సుగుణమ్మ కుమారుడిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మధ్యనే మళ్లీ బైయిల్ పై విడుదలయ్యాడు.

బెయిల్ పై విడుదలైన సుగుణమ్మ కుమారుడు దర్జాగా తన కళ్ల ముందే తిరుగుతుండటంతో.. బేగరి దేవయ్య రగిలిపోయాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే.. చాంద్రాయణగుట్ట అశామాబాద్ కు చెందిన మహ్మద్ జబీర్‌ను సంప్రదించాడు. తన కుమారుడిని చంపిన వారిని చంపాలంటూ రూ. 30 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తొలివిడతగా రూ. 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. దేవయ్య ఇచ్చిన డబ్బుతో 12 వేట కొడవళ్ళు కోనుక్కుని జబీర్ మహమ్మద్ తన అనుచరుడు రహమత్ తో కలిసి స్కార్పియో కారులో రాజేంద్రనగర్ నుండి సంగారెడ్డి బయలుదేరుతుండగా శంషాబాద్ ఎస్ఒటి, రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. హాసన్ నగర్‌లో మహమ్మద్ జబీర్, మహమ్మద్ రహమత్, బేగరి దేవయ్య, సయ్యద్ సోహబ్, తలారి శ్రీకాంత్, బేగరి సందీప్ లను అరేస్ట్ చేసి వారి వద్ద ఉన్న స్కార్ పియో కార్ (AP10 AB3107) ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, జబీర్‌పై గతంలోనే అనేక కేసులు ఉండటంతో పాటు.. రౌడీషీట్ కూడా ఉంది.

Also read:

Tiger in Telangana: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి కలకలం.. పశువుల కాపరి మృతి..

Viral News: ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. విమానంలో తింటున్న ఫీలింగ్‌.. అందరూ ఆహ్వానితులే..!

Viral Video: రెచ్చగొట్టారు.. రచ్చ చేసింది.. రైనో దాడి చేస్తే ఇలాగే ఉంటుంది మరి..!