Telangana: ట్రైనింగ్‌ నర్సుతో అసభ్యకర ప్రవర్తన.. కీచక డాక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

ట్రైనింగ్‌ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింగ్ చౌహన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Telangana:  ట్రైనింగ్‌ నర్సుతో అసభ్యకర ప్రవర్తన.. కీచక డాక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు
Representative Photo
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2021 | 10:20 AM

ట్రైనింగ్‌ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింగ్ చౌహన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అతనిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ విధులు నిర్వహిస్తోన్న నర్సింగ్‌ చౌహాన్‌ తనను వేధించాడంటూ సునీత అనే ట్రైనింగ్‌ నర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఛాంబర్ కు తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలు అడిగాడని.. బావ వరుస అవుతానని చెంపలపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

కాగా ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. హాస్పిటల్‌ ఆవరణలోనే సీనియర్‌ వైద్యుడికి దేహశుద్ధి చేశారు. అయితే పోలీసులు డాక్టర్‌కు వత్తాసు పలుకుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు చెబుతోంది.

Also Read:

Andhra Pradesh: మద్యం బాటిల్‌లో చెత్తాచెదారం, పురుగులు.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..

Andhra Pradesh: ఆ నిందితుడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు.. తమకే అప్పగించాలని వినతుల వెల్లువ.. ఇంతకీ అతను ఎవరంటే..

Telangana: కొమురం భీం జిల్లాలో విద్యుత్‌ కంచెలు తగిలి మహిళ మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..