Crime news: మిరాజ్ ఫైటర్ జెట్ టైరును అపహరించిన దుండగులు.. కేసు నమోదు చేసిన పోలీసులు..
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ట్రక్కు నుంచి యుద్ధ విమానం(ఫైటర్ జెట్) టైర్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ట్రక్కు నుంచి యుద్ధ విమానం(ఫైటర్ జెట్) టైర్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. రాజస్థాన్‌లోని లక్నో ఎయిర్‌బేస్ నుంచి జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌కు యుద్ధ విమానాన్ని తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ట్రక్కు డైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు ప్రాథమిక ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..నవంబర్ 27న లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ నుంచి జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌కు మిరాజ్- 2000 ఫైటర్ జైట్‌ను రాత్రి ట్రక్కులో తీసుకెళ్లారు. అయితే అర్ధరాత్రి 12.30- 1 గంట సమయంలో షహీద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రక్కు నెమ్మదిగా ముందుకు కదులుతుండడంతో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు చాకచక్యంగా టైరును అపహరించారు.
కాగా దొంగలు టైరును కట్టేందుకు ఉపయోగించే పట్టీని ధ్వంసంచేసి చోరీకి పాల్పడ్డారని ట్రక్ డ్రైవర్ చెబుతున్నాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షహీద్ మార్గంలోని CCTV పుటేజీలన్నింటినీ పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు. కాగా ట్రక్కులో యుద్ధవిమానంతో పాటు విమానాల్లో ఇంధనం నింపే రీఫ్యూల్లర్ వెహికల్, యూనివర్సల్ ట్రాలీ, పెద్ద నిచ్చెన, ఎయిర్‌క్రాఫ్ట్ టైర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దుండగులు కేవలం టైరు మాత్రమే దొంగలించారని వారు పేర్కొన్నారు.
Also Read:
Petrol Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
WhatsApp: వాట్సప్‌లో ఉబర్ రైడ్ బుక్ చేసుకోవచ్చు.. మొదటగా అక్కడ ప్రారంభం..
LIC: ఎల్ఐసీ పాలసీతో పాన్ లింక్ చేసుకున్నారా.. లేకుంటే వెంటనే చేసుకోండి.. ఎందుకంటే..