Telangana: కొమురం భీం జిల్లాలో విద్యుత్‌ కంచెలు తగిలి మహిళ మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..

అటవీ జంతువుల బారి నుంచి పంట చేలకు అమర్చిన విద్యుత్‌ కంచెలు మనుషుల పాలిట మృత్యుపాశాలుగా మారిపోతున్నాయి.

Telangana: కొమురం భీం జిల్లాలో విద్యుత్‌  కంచెలు తగిలి మహిళ మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2021 | 8:07 AM

అటవీ జంతువుల బారి నుంచి పంట చేలకు అమర్చిన విద్యుత్‌ కంచెలు మనుషుల పాలిట మృత్యుపాశాలుగా మారిపోతున్నాయి. ప్రమాదవశాత్తూ వాటి బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యుత్‌ కంచెలు తగిలి ఒక మహిళ మరణించింది. మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వాంకిడి మండం నవేగామ్ గ్రామపంచాయతీ పరిధిలోని టోక్కి గూడలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో ఆస్పత్రికి బాధితుల తరలింపు ఆలస్యమైంది.

వివరాల్లోకి వెళితే// టోక్కి గూడ గ్రామానికి చెందిన బుతా నీలబాయి, రాజక్క, భీమక్క, భీంరావ్ గుట్ట సమీపంలో గల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా పంట చేనుకు అమర్చిన విద్యుత్‌ కంచెలు తగలడంతో వీరిలో ఒక మహిళ చనిపోయింది.  మిగతా ముగ్గురి మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.

Also Read:

Vijayawada: బెజవాడ నగరంలో కొత్త అలజడి.. భయంతో వణికిపోతున్న ప్రజలు.. కారణమేంటంటే..!

Cyber Crime: ఎస్‌బీఐ ఫేక్ కాల్‌ సెంటర్‌తో ఫ్రాడ్‌.. వివరాలు చెప్పారో సమర్పయామి అనాల్సిందే..!

Shilpa Cheating Case: శిల్పా చౌదరి చీటింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. పోలీసుల విచారణలో మరెన్ని తేలేనో..!