Vijayawada: బెజవాడ నగరంలో కొత్త అలజడి.. భయంతో వణికిపోతున్న ప్రజలు.. కారణమేంటంటే..!

Vijayawada: బెజవాడ నగరంలో కొత్త అలజడి మొదలైంది. వెరీ డేంజరస్ చెడ్డీ గ్యాంగ్.. ఎంటరైంది. నగర శివారు ఇళ్లను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతోంది. స్థానికులకు కంటి మీద కునుకు

Vijayawada: బెజవాడ నగరంలో కొత్త అలజడి.. భయంతో వణికిపోతున్న ప్రజలు.. కారణమేంటంటే..!
Cheddi Gang
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 03, 2021 | 5:49 AM

Vijayawada: బెజవాడ నగరంలో కొత్త అలజడి మొదలైంది. వెరీ డేంజరస్ చెడ్డీ గ్యాంగ్.. ఎంటరైంది. నగర శివారు ఇళ్లను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతోంది. స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కేటుగాళ్లు. వివరాల్లోకెళితే.. తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడుతూ.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు విజయవాడలోకి ప్రవేశించింది. గుంటుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి చెడ్డీ గ్యాంగ్‌ విఫలయత్నం చేసింది.

అంతా గాఢనిద్రలో ఉండగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఐదుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్‌ ముఠా అపార్ట్‌మెంట్‌లోకి ఎంటరైంది. చేతుల్లో ఆయుధాలను పట్టుకుని నల్లూరి అపార్ట్‌మెంట్‌‌ మొదటి అంతస్తులోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్‌.. ఓ ఫ్లాట్‌ తలుపులు పగలుకొట్టే ప్రయత్నం చేశారు. శబ్దాలకు నిద్రలేచిన అపార్ట్‌మెంట్ వాసులు లైట్లు వేయడంతో అక్కడ్నుంచి పరారైంది చెడ్డీ గ్యాంగ్‌. సీసీ ఫుటేజ్‌ను చెక్ చేస్తే ఈ చెడ్డీ గ్యాంగ్‌ కథ బయటపడింది. రెండ్రోజుల క్రితం విజయవాడ చిట్టినగర్‌లోనూ చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్ చేసింది. ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డారు. ముసుగులు ధరించి వచ్చిన దొంగల ముఠా ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకుని వెళ్లిపోయారు.

విజయవాడలో ఫస్ట్ టైమ్‌ చెడ్డీ గ్యాంగ్‌ ముఠాలు కనిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీలో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో నైట్ పెట్రోలింగ్ పెంచారు. అయితే, గుంటుపల్లి, చిట్టినగర్‌.. రెండు చోట్లా చోరీకి ప్రయత్నించింది ఒకే ముఠాగా భావిస్తున్నట్లు తెలిపారు ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్. అవసరమైతే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని చెడ్డీ గ్యాంగ్‌లను తలుచుకుని బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. ఈ చెడ్డీ గ్యాంగ్‌లకు వెంటనే అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్