అక్కపై ఉన్న కోపాన్ని కుక్కపై తీర్చుకున్న ప్రబుద్ధుడు
రెండు కుటుంబాల మధ్య చెలరేగిన చిచ్చుకు.. ఓ ముగజీవి బలైపోయింది. ఆస్తి విషయంలో అక్కతో తగాదా వచ్చింది ఆ ప్రబుద్ధుడికి. అంతే అక్కపై ద్వేషం పెంచుకున్న అతడు.. ఎలాగైన అక్కపై రివేంజ్ తీసుకోవాలని స్కెచ్ వేశాడు. అక్కని మానసిక క్షోభకు గురిచెయ్యాలంటే.. అక్కకి ఇష్టమైన వాటిని లేకుండా చేయాలనుకున్నాడో ఏమో.. అనుకున్నదే తడవుగా ప్లాన్ వేశాడు. ఆ అక్కకి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ శునకం ఉంది. అదంటే ఆమెకు అమితమైన ప్రేమ. ఇంకేంది.. ఆ ప్రేమను అక్కకి […]
రెండు కుటుంబాల మధ్య చెలరేగిన చిచ్చుకు.. ఓ ముగజీవి బలైపోయింది. ఆస్తి విషయంలో అక్కతో తగాదా వచ్చింది ఆ ప్రబుద్ధుడికి. అంతే అక్కపై ద్వేషం పెంచుకున్న అతడు.. ఎలాగైన అక్కపై రివేంజ్ తీసుకోవాలని స్కెచ్ వేశాడు. అక్కని మానసిక క్షోభకు గురిచెయ్యాలంటే.. అక్కకి ఇష్టమైన వాటిని లేకుండా చేయాలనుకున్నాడో ఏమో.. అనుకున్నదే తడవుగా ప్లాన్ వేశాడు. ఆ అక్కకి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ శునకం ఉంది. అదంటే ఆమెకు అమితమైన ప్రేమ. ఇంకేంది.. ఆ ప్రేమను అక్కకి దూరం చేయాలనుకున్నాడు. వెంటనే ఆ కుక్కను హతమార్చాడు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని లాలాపేటలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న రమాదేవి.. తన తల్లితో నివాసం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న రమాదేవి.. తన తల్లితో కలిసి సికింద్రాబాద్ పరిధిలోని లాలాపేటలో నివాసం ఉంటున్నారు. అయితే రమాదేవికి పెంపుడు కుక్కలంటే ఇష్టం ఉండటంతో… ఆమె పొమేరేనియన్ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అయితే తన తమ్ముడు నాగరాజుతో గత కొద్ది రోజులుగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నాగరాజు తన అక్కపై కక్ష పెంచుకున్నాడు. ఆ కక్షను కాస్త అక్కపై కాకుండా.. ఆమె పెంచుకుంటున్న కుక్కపై చూపాడు. సోదరికి ఇష్టమైన ఆ కుక్కను గొంతు నులిమి చంపేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రమాదేవి పోలీసులను ఆశ్రయించింది. తన సోదరుడు నాగరాజు తన పెంపుడు కుక్కను హతమార్చాడని ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ హత్యలో నాగరాజుకు అతడి భార్య కూడా సాయం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలు రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగరాజును అరెస్ట్ చేశారు. కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణ గూడ వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.
కాగా, తన తమ్మడు మద్యానికి బానిసయ్యాడని.. తనను, తన తల్లిని చంపేస్తానని పలుమార్లు బెదిరించాడని పోలీసులతో రమాదేవి చెప్పారు. ప్రస్తుతం సొంత సోదరిపై కోపాన్ని పెంపుడు కుక్కపై చూపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.