భార్యను నైనిటాల్ కి తీసుకువెళ్లి ఎత్తయిన కొండ ప్రాంతం నుంచి కిందికి తోసివేశాడు.. ఉత్తరాఖండ్ లో దారుణం

ఉత్తరాఖండ్ లో తన భార్యను నైనిటాల్ కి తీసుకువెళ్లి ఆమెను ఎత్తయిన కొండ ప్రాంతం నుంచి తోసివేసిన ఓ కసాయి భర్త ఉదంతమిది.. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘోరం జరిగిన పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో సేల్స్ మన్ ఉద్యోగం..

భార్యను నైనిటాల్ కి తీసుకువెళ్లి ఎత్తయిన కొండ ప్రాంతం నుంచి కిందికి తోసివేశాడు.. ఉత్తరాఖండ్ లో దారుణం

ఉత్తరాఖండ్ లో తన భార్యను నైనిటాల్ కి తీసుకువెళ్లి ఆమెను ఎత్తయిన కొండ ప్రాంతం నుంచి తోసివేసిన ఓ కసాయి భర్త ఉదంతమిది.. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘోరం జరిగిన పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో సేల్స్ మన్ ఉద్యోగం చేసే ఇతగాడు తన స్నేహితురాలైన బబిత అనే యువతిని పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే ఎన్నిసార్లు అడిగినా పెళ్లి మాట ఎత్తకపోయేసరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు పెట్టింది. కోర్టులో విచారణ జరిగిన అనంతరం అతడిని తీహార్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే బబితను వివాహమాడతానని జైలు అధికారులకు చెప్పడంతోను., బబిత అతనిపై కేసును ఉపసంహరించుకోవడంతోను మొత్తానికి అధికారులు అతడిని విడుదల చేశారు.

అన్నట్టే బబితను అతడు వివాహం చేసుకున్నా సదా ఆమెను వేధిస్తూ వచ్చాడట. నీ వల్లే జైలు పాలయ్యానని ఆమెను కొట్టడం వంటి టార్చర్ పెట్టేవాడని ఆమె తలిదండ్రులు తెలిపారు. మళ్ళీ పోలీసు కేసు పెట్టినా మారడని తెలిసి తాము కామ్ అయిపోయామని వారు చెప్పారు. చివరకు గత జూన్ 21 న తమ కుమార్తె కనబడకుండా పోయిందని, ఆమె ఫోన్ స్విచాఫ్ అయి ఉందని వారు తెలిపారు. తమ అల్లుడిని అడగగా ఏవో కారణాలు చెప్పి తప్పించుకునేవాడన్నారు. తమకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా చివరికి వారి ఇంటరాగేషన్ లో అసలు సంగతి చెప్పాడు. బబితను ఏదో నెపం మీద నైనిటాల్ తీసుకువెళ్లి కొండ ప్రాంతం నుంచి తోసివేశానని ఆ యువకుడు చెప్పాడు. పోలీసులు హత్యాభియోగంపై అరెస్టు చేసి మళ్ళీ జైలుకు పంపారు.

మరిన్ని ఇక్కడ చూడండి : చిరంజీవి, ఎన్టీఆర్‌ చెప్పారని 4ఏళ్లు.. నేర్చుకున్నా..! యువహీరో తో ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ:Hero Teja Sajja video.

 ఈ టీవీ ధర వింటే…మూర్ఛపోవడం ఖాయం..సరికొత్త టెక్నాలజీ రూపొందించిన శాంసంగ్‌:Samsung The Wall Video

 మంచుకొండల్లో చిక్కుకున్న యంగ్ హీరో.. అడ్వంచరస్‌ టూర్‌లో బిజీ బిజీ..: Navdeep Video.

 Jemimah Rodrigue Viral Video : ఇదేం బ్యాటింగ్‌ అక్క.. బౌలర్‌కు పిచ్చెక్కించావ్‌గా.. ! జెమిమా రోడ్రిగ్‌ అదిరిపోయే బాటింగ్ వీడియో.

Click on your DTH Provider to Add TV9 Telugu