Case on Rajgopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు.. మంత్రి జగదీష్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకే!
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న మంత్రి జగదీష్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు కేసు నమోదు చేశారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న మంత్రి జగదీష్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు కేసు నమోదు చేశారు. తహశీల్దార్ గిరిధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు చౌటుప్పల్ పోలీసులు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై సొంత నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న చౌటుప్పల్ పట్టణంలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకొని మైక్ లాగేసి వాగ్వాదానికి దిగారు. దీంతో రేషన్‌కార్డుల పంపిణీలో గొడవ చేసిన ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులపై చౌటుప్పల్ తసిల్దార్ గిరిధర్ ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తసిల్దార్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితోపాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు, రాజగోపాల్ రెడ్డి వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడారు. షర్మిల నిర్వహిస్తున్న నిరుద్యోగ దీక్షకు మద్దతు ప్రకటించారు.