మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యోగి వేమన విశ్వ విద్యాలయం ప్రిన్సిపాల్ సస్పెన్షన్.

Kadapa Yogi Vemana University: కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సిలర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి...

మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యోగి వేమన విశ్వ విద్యాలయం ప్రిన్సిపాల్ సస్పెన్షన్.
Yogi Vemana
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 27, 2021 | 6:50 PM

Kadapa Yogi Vemana University: కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సిలర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పీజీ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.కృష్ణారెడ్డి వర్సిటీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా వర్సిటీ వైస్‌ ఛాన్సిలర్‌ సూర్య కళావతి వద్దకు ఈ విషయం చేరింది. దీంతో రంగంలోకి దిగిన ఆమె కృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రకటన జారీ చేశారు.

లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తన దృష్టికి రాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూర్య కళావతి తెలిపారు. ఇక ప్రిన్సిపాల్‌ కృష్ణ రెడ్డి స్థానంలో చంద్రమతి శంకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు ఎంత వరకు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి వీసీ ఏడు మంది సభ్యులతో కూడినో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా అతనిపై చర్యలు తీసుకుంటామని సూర్య కళావతి తెలిపారు.

Also Read: AP Corona Cases: ఏపీలో దిగివస్తున్న కరోనా కేసులు.. పెరగుతున్న కోలుకున్న వారి సంఖ్య.. ఇవాళ కొత్త కేసులు ఎన్నంటే..?

Faction Murder: కడప జిల్లాలో మరోసారి భగ్గుమన్న పాతకక్షలు.. గ్రామ సర్పంచ్‌ను వేటకొడవళ్లతో నరికి చంపిన దుండగులు..!

Ration Home Delivery: రేషన్ పంపిణీ ట్రక్కుల ఉత్తర్వుల్లో మార్పులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్