Road Accident: హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న ఆరు వాహనాలు.. ముగ్గురు దుర్మరణం..
Maharashtra Road Accident: జాతీయ రహదారిపై వాహనాలు రయ్యిరయ్యిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒకేసారి ఆరు వాహనాలు
Maharashtra Road Accident: జాతీయ రహదారిపై వాహనాలు రయ్యిరయ్యిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒకేసారి ఆరు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. మహారాష్ట్రలోని ఖోపొలి సమీపంలో ఉన్న ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై జరిగింది. ఈ ప్రమాదం అనంతరం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉదయం 5గంటల 30నిమిషాల సమయంలో కోళ్లను తరలిస్తున్న వాహనంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
జాతీయ రహదారిపై కోళ్లను తీసుకెళ్లే ట్రాలీ వ్యాన్ ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుకనే వేగంగా వస్తున్న కార్.. వ్యానుని ఢికొట్టి దూసుకెళ్లింది. కార్ వెనుకగా అదేవేగంతో వస్తున్న మినీ లారీ కార్‌ను ఢికొట్టింది. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జుగా మారింది. కారులో ఉన్న ప్రయాణికుల్లో ఇద్దరు మరణించగా.. కొళ్ల వ్యానులో ఉన్న మరొకరు మరణించినట్లు ఖోపోలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శిరీష్ పవార్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కున్న బాధితులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన అనంతరం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయిందని.. క్లియర్ చేసేందుకు కొంత సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖోపోలి పోలీసులు తెలిపారు.
Also Read: