ఆగని అక్రమ రవాణా..ఏరులై పారుతోంది !

ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. గత నాలుగు నెలల కాలంలో ఏపీ ఎస్‌ఈబీ చేసిన దాడులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ లెక్కలు ఎక్సైజ్‌ అధికారులనే షాక్‌కు గురి చేస్తున్నాయి.

ఆగని అక్రమ రవాణా..ఏరులై పారుతోంది !
Follow us

|

Updated on: Aug 27, 2020 | 5:51 PM

ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ఈ మధ్య కాలంలో అక్రమ మద్యం తరలింపు కేసులు విపరీతంగా పెరిగాయి. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని ఏపీలోకి తీసుకొస్తున్నారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాఎన్నిసార్లు దాడులు చేసి పట్టుకుంటున్నా… అక్రమ మద్యానికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. మద్యం ఏరులై పారుతునే ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా కేసుల సంఖ్య ఏకంగా వేల సంఖ్యలో ఉంది. దశల వారీగా మద్య నిషేధంలో భాగంగా జగన్‌ సర్కారు మద్యం ధరలు భారీగానే పెంచింది. దీనికితోడు అక్కడ బ్రాండెడ్‌ మద్యం అందుబాటులో ఉండడం లేదు. దీంతో అక్రమార్కులు అడ్డదారుల్లో మద్యం రవాణా సాగిస్తూ వ్యాపారం మూడు షాపులు, ఆరు కాటన్‌లుగా సాగిస్తున్నారు. గత నాలుగు నెలల కాలంలో ఏపీ ఎస్‌ఈబీ చేసిన దాడులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

ఏపీలో మొత్తం 33 వేల 754 మద్యం తరలింపు కేసులు నమోదు అయ్యాయి. ఈ మద్యం తరలిస్తున్న 43 వేల 976 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడుల్లో ఏకంగా 2 లక్షల 43 వేల 226 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం, సారా కలిపి 3 లక్షల 72 వేల 404 లీటర్ల బాటిళ్లను ధ్వంసం చేశారు. అలాగే సారా తయారీకి ఉంచిన బెల్లపు ఊట లక్షా 35 వేల 700 లీటర్లను బయట పారబోశారు. మొత్తం అక్రమ మద్యం తరలింపు కేసుల్లో 12 వేల 455 వాహనాలు సీజ్‌ చేశారు. ఈ లెక్కలు ఎక్సైజ్‌ అధికారులనే షాక్‌కు గురి చేస్తున్నాయి.

ఇక, అధికారులకు దొరికిన మద్యమే లక్షల లీటర్లు ఉంటే.. దొరకని మద్యం ఇంకెంత ఉంటుందోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యాన్ని తరలిస్తున్నారు. ఉత్తరాంధ్రకు ఎక్కువగా ఒడిశా నుంచి అక్రమ మద్యం వస్తోంది. రోడ్డు మార్గంలో తనిఖీలు ఎక్కువగా ఉండడంతో నదీ మార్గంలో పడవల్లో మద్యాన్ని తరలిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు ఎక్కడికక్కడ అక్రమ రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్నా మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు.

తెలంగాణ కంటే ఏపీలో అటుఇటుగా 75 శాతం లిక్కర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలించడానికి కనిపించిన ప్రతి అడ్డదారి తొక్కుతోంది లిక్కర్ మాఫియా. కార్లు, కొరియర్లే కాదు ఆఖరికి బైక్‌ల మీద అక్రమ మద్యాన్ని తరలిస్తున్నారు.

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..