AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంపీ సంతోష్ పేరుతో డబ్బులు గుంజుతున్న బాలుడు అరెస్ట్

మరో నకిలీ ఫేష్ బుక్ కేటుగాడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి మోసాలకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు....

ఎంపీ సంతోష్ పేరుతో డబ్బులు గుంజుతున్న బాలుడు అరెస్ట్
Sanjay Kasula
|

Updated on: Aug 27, 2020 | 6:37 PM

Share

మరో నకిలీ ఫేష్ బుక్ కేటుగాడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి మోసాలకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతడు చేసిన మోసాలపై ఆరా తీస్తున్నారు.

నకిలీ ఫేస్ బుక్ ఖాతాలో పలువురికి సందేశాలు పంపించినట్లుగా గుర్తించారు. తన ఖాతాలో ఉన్నటువంటివారిని డబ్బులు అడిగినట్లు ఆరోపణలున్నాయి. మాదాపూర్‌లో నివాసముండే ఓ యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతడిని మాటల్లో దింపి డబ్బులు అవసరముందంటూ మెసేజ్‌లతో పాటు కాల్స్ కూడా చేశాడు. ఒక ఎంపీ డబ్బులు అడగడం ఏమిటని అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్‌ ఫేస్‌ బుక్ ఐడీ ఆధారంగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించి అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి మోసాలు గతంలో ఏమైనా చేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు చాలా మంది ఉంటారని హెచ్చరించారు సైబర్ క్రైం పోలీసులు. ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూలు చేసే ముఠాలు నెట్టింట్లో చాలా ఉంటాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏమైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Follow Us
ఉక్కులాంటి బలం.. జస్ట్ 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ టిఫిన్..
ఉక్కులాంటి బలం.. జస్ట్ 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ టిఫిన్..
హీరోలందరూ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్
హీరోలందరూ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్
2026లో ఆండ్రాయిడ్, ఐఫోన్ కోసం టాప్ 10 మొబైల్ పేమెంట్ యాప్స్
2026లో ఆండ్రాయిడ్, ఐఫోన్ కోసం టాప్ 10 మొబైల్ పేమెంట్ యాప్స్
ఆ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు వయస్సు, PET నుంచి భారీ మినహాయింపు
ఆ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు వయస్సు, PET నుంచి భారీ మినహాయింపు
కేరళా స్టైల్‌లో ఆ కొబ్బరి నూనెతో ఇలా వండి తింటే ఉంటాదీ..
కేరళా స్టైల్‌లో ఆ కొబ్బరి నూనెతో ఇలా వండి తింటే ఉంటాదీ..
ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్ల వర్షమే.. ప్రళయ భీకర ప్రహార్‌ స్పెషా
ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్ల వర్షమే.. ప్రళయ భీకర ప్రహార్‌ స్పెషా
సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!
సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!
14 ఏళ్ల నిరీక్షణకు తెర ?తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై బయటపడుతుందా?
14 ఏళ్ల నిరీక్షణకు తెర ?తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై బయటపడుతుందా?
మే 5న జరగాల్సిన JEE Main 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు
మే 5న జరగాల్సిన JEE Main 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు
డిలీట్‌ చేసిన ఫొటోలు మళ్లీ కావాలంటే ఇలా చేయండి
డిలీట్‌ చేసిన ఫొటోలు మళ్లీ కావాలంటే ఇలా చేయండి