Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
Viral Video: మహారాష్ట్రలో భయానక ఘటన చోటుచేసుకుంది. రోజంతా కష్టపడి పనిచేసిన వ్యవసాయ కూలీలు ఆరుబయట నిద్రిస్తుండగా ఓ చిరుతపులి అటువైపు వచ్చింది. నిద్రలో ఉన్న వారిపై దాడి చేసేందుకు దూసుకొస్తున్న సమయంలో అటుగా కారులో వెళ్తున్న వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. పదేపదే హారన్ కొట్టి చిరుతను తరిమేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Viral Video: మహారాష్ట్రలో భయానక ఘటన చోటుచేసుకుంది. రోజంతా కష్టపడి పనిచేసిన వ్యవసాయ కూలీలు ఆరుబయట నిద్రిస్తుండగా ఓ చిరుతపులి అటువైపు వచ్చింది. నిద్రలో ఉన్న వారిపై దాడి చేసేందుకు దూసుకొస్తున్న సమయంలో అటుగా కారులో వెళ్తున్న వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. పదేపదే హారన్ కొట్టి చిరుతను తరిమేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిద్రలో ఉన్న కూలీల దగ్గరకు వచ్చిన చిరుతపులి
మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఉన్న నవేగావ్‌బంధ్ నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వరి కోతలు, నూర్పిడి పనుల కోసం పంజాబ్ నుంచి కొంతమంది కూలీలు అక్కడికి వచ్చారు. వారితోపాటు మూడు వరి నూర్పిడి యంత్రాలను తీసుకొచ్చారు. అటవీ శాఖ కాలనీ సమీపంలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేసుకున్నారు. రోజంతా పొలాల్లో కష్టపడి పనిచేసిన కూలీలు రాత్రి భోజనం చేసి ఆరుబయట నిద్రపోయారు. అయితే, అదే సమయంలో ఓ చిరుతపులి అటువైపు వచ్చింది. చీకట్లో నెమ్మదిగా నడుచుకుంటూ నిద్రిస్తున్న కూలీల దగ్గరకు చేరుకుంది. వారంతా గాఢ నిద్రలో ఉండటంతో చిరుత వచ్చిన విషయాన్ని గుర్తించలేకపోయారు. కొద్దిసేపు అక్కడే ఆగిన చిరుత.. ఒక్కసారిగా కూలీల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది.
A chilling encounter near Navegaonbandh National Park in Maharashtra’s Gondia district saw a leopard approach sleeping farm workers in the darkness. Alert driver Manish Nevare reportedly spotted the big cat and repeatedly honked his car horn, frightening the animal and preventing a potentially dangerous encounter with the unsuspecting labourers.
#Leopard #Maharashtra #Gondia #ViralVideo #Wildlife #NavegaonbandhNationalPark
— The Daily Jagran (@TheDailyJagran) October 26, 2026
హారన్ శబ్దంతో పారిపోయిన చిరుత
అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న మనీష్ నెవారే అనే వ్యక్తి చిరుతపులిని గమనించాడు. కూలీలు ప్రమాదంలో ఉన్నారని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కారుతో చిరుత వైపు వెళ్తూ పదేపదే హారన్ మోగించాడు. హారన్ శబ్దానికి ఉలిక్కిపడిన చిరుత అక్కడి నుంచి పరుగులు తీసింది. మనీష్ తన కారుతో దానిని వెంబడించాడు. కారు హెడ్‌లైట్ల వెలుతురులో చిరుతపులి కనిపిస్తుండగా, దానిని తరిమేందుకు అతడు ప్రయత్నించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. సమయానికి మనీష్ స్పందించడంతో నిద్రలో ఉన్న కూలీలు చిరుతపులి నుంచి ప్రమాదాన్ని తప్పించుకోగలిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదకర పరిస్థితుల్లో అతడు చూపిన సమయస్ఫూర్తిపై పలువురు స్పందిస్తున్నారు.
అటవీ ప్రాంతాల పక్కన బస చేసే వారికి హెచ్చరిక
గోండియా జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు, పంట నూర్పిడి పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరిలో కొందరు పొలాల సమీపంలోనే తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుంటారు. అటవీ ప్రాంతాల సమీపంలో ఉండేవారు చీకటి పడిన తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది హెచ్చరించారు. నవేగావ్‌బంధ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో వన్యప్రాణుల సంచారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు.