AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టేజ్‌పై ధనరాజ్‌ను కొట్టినంత పని చేసిన మంచు మనోజ్.. యాంకర్ అయితే వణికిపోయింది

ప్రముఖ నటుడు ధనరాజ్ ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్‌తో తనకున్న అనుబంధం, వైరల్ అయిన ప్రాంక్ వీడియో వెనుకటి కథ, అలాగే మనోజ్ ప్రస్తుత సినీ కెరీర్ విరామంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మనోజ్‌తో కలిసి కరెంట్ తీగ చిత్రంలో నటించానని గుర్తుచేసుకున్నారు.

స్టేజ్‌పై ధనరాజ్‌ను కొట్టినంత పని చేసిన మంచు మనోజ్.. యాంకర్ అయితే వణికిపోయింది
Manchu Manoj
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2026 | 9:35 AM

Share

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు సంబంధించిన ఓ పాత వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ వీడియోలో మనోజ్ ప్రవర్తించిన తీరుపై పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్స్ కూడా చేశారు. అయితే, ఆ ఘటన వెనుక అసలు విషయం ఏమిటి? మనోజ్ తన స్నేహితుడితో కలిసి ఎలాంటి ప్లాన్ చేశారు? అనేది ఒక్కసారి చూద్దాం! గతంలో ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ నటుడు, ధనరాజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు మరోసారి ఆసక్తిని పెంచుతున్నాయి. మంచు మనోజ్‌తో కలిసి ధనరాజ్ గతంలో ‘కరెంట్ తీగ’ సినిమాలో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ‘జంప్ జిలాని’ ఆడియో వేడుకలో జరిగిన ప్రాంక్ గురించి ధనరాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మనోజ్ తనపై ప్రాంక్ చేయాలని ప్లాన్ చేసిన విషయం కామన్ ఫ్రెండ్ భూపాల్ ద్వారా ముందుగానే తెలిసిందని తెలిపారు. అయినప్పటికీ, స్టేజ్‌పై ఆ సన్నివేశం సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో తనకు ఏమీ తెలియనట్టుగా నటించినట్లు వివరించారు.

ఆడియో వేడుకలో మనోజ్ ధనరాజ్‌పై కోపంగా స్పందించినట్లు కనిపించిన వీడియో అప్పట్లో నెట్టింట వైరల్ అయింది. ఈ ఘటనను నిజమని భావించిన కొందరు నెటిజన్లు మనోజ్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆ ప్రాంక్ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పక్కనే  ఉన్న యాంకర్ శిల్ప కూడా అది నిజమే అనుకోని కంగారు పడిపోయారు. అసలు అది పక్క ప్లాన్ తో చేసిన ప్రాంక్ అని వివరించారు. అప్పట్లో ‘కరెంట్ తీగ’ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఇద్దరూ కలిసి ఓ ఫొటో దిగాలని నిర్ణయించుకున్నారట. మనోజ్ చేతులు కట్టుకుని నిలబడగా, ధనరాజ్ ఆయన భుజంపై చేయి వేసి ఫొటో దిగారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే విషయం ప్రేక్షకులకు అర్థమైందని ధనరాజ్ వివరించారు.

మంచు మనోజ్‌తో తనకున్న స్నేహం గురించి ధనరాజ్ మాట్లాడుతూ, ప్రతిరోజూ ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుకునేంత సన్నిహితంగా లేకపోయినా, సినీ కార్యక్రమాలు, ఆడియో వేడుకల్లో కలిసినప్పుడు పరస్పరం పలకరించుకుంటూ ఉంటామని తెలిపారు. ఒకరి క్షేమ సమాచారాన్ని మరొకరు తెలుసుకుంటూ తమ పరిచయాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచు మనోజ్ సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉండటంపై ధనరాజ్ మాట్లాడుతూ.. మనోజ్ కేవలం సినిమా చేయాలనే ఉద్దేశంతో కాకుండా, మంచి కథతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం మనోజ్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. విలన్ గానూ నటిస్తూ మెప్పిస్తున్నారు మనోజ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్టేజ్‌పై ధనరాజ్‌ను కొట్టినంత పని చేసిన మంచు మనోజ్..
స్టేజ్‌పై ధనరాజ్‌ను కొట్టినంత పని చేసిన మంచు మనోజ్..
పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాపై విమర్శలు?
పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాపై విమర్శలు?
హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా.. నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం..
హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా.. నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం..
ఒక్క పరుగు కొంపముంచిందా?
ఒక్క పరుగు కొంపముంచిందా?
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!
చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!