ఏముంది మావ..! దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. మాధురి రాథోడ్ ఇరగదీసిందిగా
ఫోక్ సాంగ్స్.. ఈ పేరు వింటే చాలు వచ్చే వైబ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచాన్ని తెలంగాణ పల్లె పాటలు ఏలుతున్నాయి అనడంలో సందేహం లేదు. అచ్చమైన పల్లె పాటలు.. అలాగే గ్రామీణ వాతావరణం.. పల్లె పడుచుల అందచందాలు.. చక్కనైన చక్కనైన జానపద గీతాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది

ప్రతివారం యూట్యూబ్ లో చాలా రకాల సాంగ్ రిలీజ్ అవుతున్నయి. కొత్త సినిమా సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక వైపు కొత్త సినిమా సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు ఫోక్ సాంగ్స్ రిలీజ్ అయ్యి విపరీతంగా అలరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా సాంగ్స్ కంటే ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. యూట్యుబ్స్ లో ప్రతి నెల కొత్త కొత్త ఫోక్ సాంగ్స్ రిలీజ్ అయ్యి తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ విడుదలై సంచలనాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. రీజనల్ గానే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ ఫోక్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది.
ఇటీవలే ఈ సాంగ్ విడుదలైంది. ఈ ఫోక్ సాంగ్ లో ఆడియన్స్ ను రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఫోక్ సాంగ్స్ లో మాధురి రాథోడ్ మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె తన డాన్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇటీవల ఓ వివాదంలోనూ ఆమె చిక్కుకుంది. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి తిరిగి సాంగ్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన ఓ ఫోక్ సాంగ్ తెగ వైరల్ అవుతుంది.
ఇక ఇప్పుడు మరోసారికొత్త సాంగ్ తో ఆడియన్స్ ముందుకువచ్చింది. భామ సుందరాలో ఎన్నెలా అంటూ సాగే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ సాంగ్ ను సరసింహులు, ముకుంద ఆలపించారు. అలాగే ఈ సాంగ్ లో మాధురి రాథోడ్ డాన్స్ చేశారు. రామస్వామి ఈ సాంగ్ ను రచించారు. ఈ సాంగ్ కు వెంకట్ అజ్మీర్ సంగీతం అందించాడు. ఇక ఈ సాంగ్ ఇటీవలే విడుదలైంది. ఇప్పటికే ఈ సాంగ్ 8 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ క్రేజీ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
