అత్యాచార ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన యాంక‌ర్ ప్ర‌దీప్

త‌నపై వివిధ వ‌ర్గాల‌కు చెందిన‌ 139 మంది వ్య‌క్తులు ‌ గ‌త కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఇటీవ‌ల ఓ యువ‌తి పంజాగుట్ట‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

  • Ram Naramaneni
  • Publish Date - 5:45 pm, Thu, 27 August 20
అత్యాచార ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన యాంక‌ర్ ప్ర‌దీప్

త‌నపై వివిధ వ‌ర్గాల‌కు చెందిన‌ 139 మంది వ్య‌క్తులు ‌ గ‌త కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఇటీవ‌ల ఓ యువ‌తి పంజాగుట్ట‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసును సీసీఎస్ పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. కాగా ఈ కేసులో యాంక‌ర్ ప్ర‌దీప్‌ను కూడా యువ‌తి నిందితుడిగా పేర్కొంది. ఈ ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన యాంక‌ర్ ప్ర‌దీప్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాతో త‌న‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు బాధ‌పెడుతున్నాయ‌ని, సెన్సిటీవ్ విష‌యాల్లో త‌న పేరు ఉప‌యోగిస్తూ అటాక్ చేస్తున్నార‌ని పేర్కొన్నాడు. అవ‌త‌ల వ్య‌క్తులు ఏ ఇంటెన్ష‌న్‌తో త‌న పేరు పెట్టారో తెలుసుకోకుండా సోష‌ల్ ట్రోలింగ్ చేస్తున్న‌ర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. యూట్యూబ్, వెబ్‌సైట్స్‌లో వ్యూస్ కోసం త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని ఆరోపించాడు. త‌న కుటుంబాన్ని మాన‌సికంగా ఇబ్బంది పెడుతున్నార‌ని, సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారాలు చేస్తోన్న వారిపై ఫిర్యాదు చేస్తాన‌ని వెల్ల‌డించాడు. బాధిత యువ‌తికి న్యాయం జ‌ర‌గాలి కానీ నిజ‌నిజాలు తెలియ‌కుండా త‌న‌ను టార్గెట్ చేయ‌డం భావ్యం కాద‌ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతోన్న త‌న పేరును సామాజిక‌ మాధ్య‌మాల్లో వాడటం అలవాటుగా మారిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Also Read :

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం