AIIMS Nursing Officer Jobs: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎయిమ్స్‌లో 2,551 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్) 10 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు..

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్) 10 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) విడుదల చేసింది. మొత్తం 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 16, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఎయిమ్స్ భటిండా, ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ దేవ్‌ఘర్, ఎయిమ్స్ గోరఖ్‌పూర్, ఎయిమ్స్ గువాహటి, ఎయిమ్స్ కల్యాణి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్‌పుర్, ఎయిమ్స్ రాయ్ బరేలీ, ఎయిమ్స్ న్యూదిల్లీ, ఎయిమ్స్ పట్నా, ఎయిమ్స్ రిషికేశ్, ఎయిమ్స్ విజయ్‌పూర్, ఎయిమ్స్ సీఏపీఎఫ్‌ఐఎంఎస్, ఎన్‌ఐటీఆర్‌డీ, సీఐపీ రాంచీ, జిప్‌మర్ కరైకల్, ఈఎస్‌ఐసీ న్యూఢిల్లీ వంటి తదితర సంస్థల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిప్లొమా (జీఎన్‌ఎం)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే రెండేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే రాష్ట్ర లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో మార్చి 16, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్షలు ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 16, 2026.
- సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల తేదీ: ఏప్రిల్ 4, 2026.
- అడ్మిట్ కార్డులు విడుదల తేదీ: ఏప్రిల్ 8.04.2026.
- ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 11, 2026.
- మెయిన్ రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 30, 2026.
ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
