AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో తోప్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈయన ఎవరో తెలుసా.?

ఇప్పుడున్న హీరోలందరిలో ఈ హీరో చాలా ప్రత్యేకం. సినీ పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ స్టార్ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సవాళ్లు.. అడ్డంకులు.. అవమానాలను ఎదుర్కోని స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇండస్ట్రీలో తోప్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈయన ఎవరో తెలుసా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2026 | 7:48 AM

Share

సాధారణంగా సినీప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా తారల పర్సనల్ విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరో చిన్నప్పటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం అతడు దక్షిణాదిలో టాప్ హీరో. పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.. ? ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ హీరో.. ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు.

ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యాక.. మరోవైపు తనకు ఇష్టమైన కార్ రేసింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది.. ఆ కుర్రాడు ఎవరో అని.. అతడే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్. తమిళ చిత్రపరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ హీరో. అజిత్ తన కెరీర్ ప్రారంభ దశలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ విమర్శలను స్వీకరిస్తూనే అవకాశాల కోసం ప్రయత్నించాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన అజిత్.. నెమ్మదిగా హీరోగా మారాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

అజిత్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ షూటింగ్ నుంచి బ్రేక్ దొరికితే బైక్ రేసింగ్ కు వెళ్తాడు. అలాగే ఆయనకు విమానం కూడా నడపగలడు. ఇప్పటికే విమానం నడపడం కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. విమానం నడపడం వచ్చిన ఏకైక హీరో అజిత్ కావడం విశేషం. ఇప్పటికే బైక్ పై అనేక దేశాలను చుట్టేశాడు అజిత్. 2000లో తన సహనటి బేబి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అజిత్. నాలుగు పదులు వయసు దాటిన జుట్టు పూర్తిగా తెల్లరంగులోకి మారిపోయినా కలర్ మాత్రం వేసుకోడు. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం అద్భుతమైన టెక్నాలజీతో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ తనకంటూ ఓ ఫోన్ కూడా ఉపయోగించడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. 1992లో ప్రేమ పుస్తకం అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తమిళంలో సెటిల్ అయ్యాడు అజిత్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే