ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్..
కరోనా వైరస్ బారినపడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.

కరోనా వైరస్ బారినపడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. ”నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు ఇవాళ ఫిజియోథెరపీ నిర్వహించారు. నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. నాన్న ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు, వైద్యుల కృషి అనిర్వచనీయం’ అని ఎస్పీ చరణ్ పేర్కొన్నాడు.
ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. నాన్నగారు త్వరగా కోలుకోవాలని అభిమానులు చేసే ప్రార్థనలు, చూపిస్తున్న ప్రేమతో ఆయన తిరిగి సాధారణ స్థితికి వస్తారని… దేవుడు, అభిమానులు నిజంగా గొప్పవారు అంటూ చరణ్ వీడియో సందేశం విడుదల చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అగ్ర నటులు రజనీకాంత్, మోహన్‌బాబు, కమల్‌హాసన్ తదితరులు ఆకాంక్షించారు.
#SPB Health update 27/8/20 https://t.co/BcOniMaa6c
— S. P. Charan (@charanproducer) August 27, 2020




