కలియుగ కర్ణుడు.. ఒక్కో ఉద్యోగికి రూ. 34 కోట్లు!

కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆయా సంస్థల యాజమాన్యాలు జీతాలు, బోనస్‌లు, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం సాధారణమైన విషయమే. కానీ తమ సంస్థ ఎదుగుదలకు మొదటి నుంచి కృషి చేస్తూ..

  • Ravi Kiran
  • Publish Date - 12:18 am, Fri, 28 August 20
కలియుగ కర్ణుడు.. ఒక్కో ఉద్యోగికి రూ. 34 కోట్లు!

కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆయా సంస్థల యాజమాన్యాలు జీతాలు, బోనస్‌లు, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం సాధారణమైన విషయమే. కానీ తమ సంస్థ ఎదుగుదలకు మొదటి నుంచి కృషి చేస్తూ.. కష్టనష్టాల్లో తోడుగా నిలిచిన తోటి ఉద్యోగులకు ఆ కంపెనీ షేర్లలో కోట్లు కేటాయించిన కలియుగ కర్ణుడి వృత్తాంతం ఇది.  అంతేకాదు సంస్థ ఆరంభంలోనే లాభాల్లో వాటా ఇస్తానని హామీ ఇచ్చాడట. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు ఒక్కో ఉద్యోగికి రూ. 34 కోట్లు చెల్లిస్తున్నాడు.

Also Read: కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!

అమెరికాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ నికోలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ చాలా ఫేమస్. ఇక ఈ కంపెనీ వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్ తన ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు. కంపెనీ మొదటి నుంచి తనతో పని చేస్తూ వచ్చిన తొలి 50 మంది ఉద్యోగులకు సుమారు 6 లక్షల షేర్లు( అంటే ఒక్కొక్కరికి రూ. 34 కోట్లు) ఇవ్వనున్నాడు. అది కూడా తనకు చెందిన 233 మిలియన్ డాలర్ల(రూ. 1722 కోట్లు) నుంచి ఇస్తున్నాడు. సదరు ఉద్యోగులను తీసుకునే ముందే ఈ హామీ ఇచ్చానని.. సంస్థ అభివృద్ధిలోకి తెచ్చినందుకు వారికి ఈ షేర్లు ఇస్తున్నట్లు ప్రకటించాడు.

”మొదట స్టార్టప్‌గా ఈ కంపెనీని మొదలు పెట్టినప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ ఎంప్లాయ్స్ కోసం ప్రయత్నించాను. అదృష్టవశాత్తూ నాతో కలిసి పని చేయడానికి అమోఘమైన ఉద్యోగులు దొరికారు. నా బహుమతి అందరికీ నచ్చకపోవచ్చు. కానీ నా హామీని మాత్రం నిలబెట్టుకుంటున్నా. ఆ 50 మందిలో కొందరు ఇప్పుడు కంపెనీ కూడా వదిలేశారు” అని ట్రెవర్ మిల్టన్ ఓ వీడియో ద్వారా తెలిపాడు.