Breaking News : హైదరాబాద్‌లోని బట్టల షాప్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ గౌలిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బట్టల షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

Breaking News : హైదరాబాద్‌లోని బట్టల షాప్‌లో అగ్ని ప్రమాదం
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 28, 2020 | 12:13 AM

హైదరాబాద్ గౌలిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బట్టల షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది..  ఐదు ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బట్టల షాపుకు సమీపంలో ఉన్న ఓ వసతి గృహానికి కూడా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వారిని అధికారులు బయటకు పంపించారు. పరిసర ప్రాంతాల్లోని విద్యుత్తును నిలిపివేశారు. రోడ్డుపై వాహనాల రాకపోకలు ఆపివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తిస్తుండటంతో స్థానికుల్లో కొద్దిపాటి ఆందోళన నెలకొంది. మంటలకుతోడు గాలి కూడా అధికంగా వీస్తుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు.