బిగ్‌బాస్‌-4 అభిమానులకు గుడ్ న్యూస్..

బిగ్‌బాస్‌-4 బిగ్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌-4 సీజన్‌ ప్రారంభ తేదీ తెలిసిపోయింది. షో అభిమానులకు పండగలాంటి వార్తను..

బిగ్‌బాస్‌-4 అభిమానులకు గుడ్ న్యూస్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 28, 2020 | 12:43 AM

Bigg Boss4 : బిగ్‌బాస్‌-4 బిగ్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌-4 సీజన్‌ ప్రారంభ తేదీ తెలిసిపోయింది. షో అభిమానులకు పండగలాంటి వార్తను వినిపించారు. సెప్టెంబర్‌ 6న సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌-4 షోను ప్రారంభిస్తున్నట్లు నిర్వహకులు తమ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో తిలకించే ఈ షోలో టీవీ-9 దేవి, డ్యాన్స్‌ మాస్టర్‌ రఘు, అతని భార్య సింగర్‌ ప్రణవి, మై విలేజ్ షో సెన్సేషన్ గంగవ్వ , జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే ఉండబోతున్నట్లు  తెలుస్తోంది. ప్రారంభ తేదీని మాత్రం నిర్వహాకలు తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.