ఆటగాళ్లకు సచిన్ సలహా..
బ్రాడ్‌మాన్ నుంచి ప్రేరణ పొంది ఆడండి అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు నెలలుగా ఆటలు నిలిచిపోయాయి.
బ్రాడ్‌మాన్ నుంచి ప్రేరణ పొంది ఆడండి అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు నెలలుగా ఆటలు నిలిచిపోయాయి. ఆటగాళ్ళు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, ఆటగాడు తన ఆటతీరు గురించి ఆందోళన చెందుతుండటం సహజమే.
ఇలాంటి తరుణంలో ఆటగాళ్లు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ నుంచి ప్రేరణ పొందాలని మాస్టర్ సలహా ఇచ్చారు. బ్రాడ్‌మాన్ కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1939 -1945 మధ్య ఎనిమిది సంవత్సరాలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. అయితే, ఇది ఆయన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపలేదని గుర్తు చేశారు. తన కెరీర్ చివరి రోజుల్లో కూడా బాగా చేయాలనే కసి అతనిలో ఉండేదని రాసుకొచ్చారు. అందుకే 52 మ్యాచ్‌ల్లో సగటున 99.94 పరుగులు చేశాడు. సర్ డొనాల్డ్ యొక్క 112 వ జయంతి సందర్భంగా టెండూల్కర్ ట్విట్టర్‌లో నివాళులర్పించారు.