సుప్రీంకోర్టులో కరోనిల్ వివాదంపై పతంజలికి ఊరట

కరోనిల్ ట్రేడ్ మార్క్ వివాదంలో పతంజలికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోర్టు ఆశ్రయించింది పతంజలి. దీని విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం గతంలో ఆగస్టు 14న ఇచ్చిన తీర్పును నిలిపివేసింది.

సుప్రీంకోర్టులో కరోనిల్ వివాదంపై పతంజలికి ఊరట
Balaraju Goud

|

Aug 27, 2020 | 7:33 PM

కరోనిల్ ట్రేడ్ మార్క్ వివాదంలో పతంజలికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోర్టు ఆశ్రయించింది పతంజలి. దీని విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం గతంలో ఆగస్టు 14న ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డేతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. కరోనా సమయంలో కరోనిల్ అనే పదం వాడినందుకు ఆ ఉత్పత్తిని అడ్డుకోవడం దారణమని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేపై జోక్యం చేసుకోమని చెప్పింది. ఈ అంశంపై ఆ కోర్టునే ఆశ్రయించాలని పేర్కొంది.

ఇదిలావుంటే, రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద ఉత్పత్తికి కరోనిల్ అని పతంజలి పేరు పెట్టింది. అయితే, తమిళనాడులోని చెన్నైకి చెందిన అరుద్రా ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. పరిశ్రమల క్లీనింగ్ రసాయనాలకు తమ ఉత్పత్తికి కరోనిల్ అనే ట్రేడ్ మార్కును 1993 నుంచి ఉపయోగిస్తున్నామని పేర్కొంది. పతంజలి సంస్థ ఈ పేరును వారి ఉత్పత్తులకు పెట్టికున్నట్లు ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన ఏక సభ్య ధర్మాసనం పతంజలి సంస్థ తీరును తప్పుపట్టింది. కరోనా సమయంలో ప్రజల్లో ఉన్న భయాన్ని ఈ పేరుతో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ట్రేడ్ మార్క్ నిబంధన ఉల్లంఘించిన పతంజలికి రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ ట్రేడ్ మార్కును వినియోగించకూడదంటూ ఆగస్టు 6న తీర్పు వెలువరిచింది సుప్రీంకోర్టు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu