AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Raids: స్పా సెంటర్ల ముసుగులో పాడు పనులు.. పోలీసుల ఏంట్రీతో అంతా బట్టబయలు

హైదరాబాద్ మహా నగరంలో గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న దందాలపై పోలీసులు ఫోకస్ చేశారు. గుడిమల్కాపూర్‌లోని స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఐదు మంది యువతులను రెస్క్యూ చేయగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Police Raids: స్పా సెంటర్ల ముసుగులో పాడు పనులు.. పోలీసుల ఏంట్రీతో అంతా బట్టబయలు
Arrest
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jan 06, 2024 | 2:53 PM

Share

హైదరాబాద్ మహా నగరంలో గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న దందాలపై పోలీసులు ఫోకస్ చేశారు. గుడిమల్కాపూర్‌లోని స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఐదు మంది యువతులను రెస్క్యూ చేయగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నానల్ నగర్ ప్రాంతంలో అక్రమ స్పా సెంటర్లను పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్లల్లో ఏర్పాటు చేసి జన్నత్, గోల్డెన్ అనే పేర్లతో నడిపిస్తున్న స్పా సెంటర్లపై గుడిమల్కాపూర్ – సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఐదు మంది అమ్మాయిలను రెస్క్యూ చేసిన పోలీసులు, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గత కొద్దిరోజుల నుండి స్పా పేరుతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నారని పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ దాడులు చేశారు.వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను ఉద్యోగం పేరిట హైదరాబాద్‌కు రప్పించి, ఈ వృత్తిలోకి దింపి వ్యభిచారంలోకి నేడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌లో స్పా సెంటర్ లో మాటను ఈ గలీజ్ దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

నిర్వహకులపై కేసుల నమోదు చేసిన మళ్లీ ఏదో ఒక ప్రదేశంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పేరుకి స్పా సెంటర్లు కానీ లోపల అంతా గలీజ్ గంధాన్ని నడుస్తోంది. ఓ కస్టమర్ వచ్చినప్పుడు అతనికి సంబంధించిన ఆధార్ కార్డుతో పాటుగా ఒక రిజిష్టార్‌ను సైతం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు స్పా సెంటర్లలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేయాలి. కానీ గుట్టు చప్పుడు కాకుండా జనావాసాలు ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లను ఎంచుకుని అందులో స్పా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు నిర్వహకులు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి అమ్మాయిలను ఉద్యోగం పేరిట ఈ వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక చాలామంది యువతలు ఇందులో నుండి బయటపడలేక పోతున్నారు. అయితే తాజాగా గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఐదుగురు యువతులను రక్షించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తప్పుడు వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ మహానగర పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…