Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ట్రాఫిక్ ఎస్సై.. సస్పెండ్ చేసిన సీపీ

రాష్ట్రమంతటా పెండింగ్ ట్రాఫిక్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంటే.. ఆ ట్రాఫిక్ ఎస్సై మాత్రం తన కలెక్షన్ల స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుల నుండి లంచం తీసుకున్న ఆ ట్రాఫిక్ ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. అతను లంచం తీసుకుంటున్న వీడియో పోలీస్ కమిషనర్ దృష్టికి చేరడంతో వారి పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సంఘటన హనుమకొండలో జరిగింది.

Viral Video: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ట్రాఫిక్ ఎస్సై.. సస్పెండ్ చేసిన సీపీ
Trffic Si Suspend
Follow us
G Peddeesh Kumar

| Edited By: Srikar T

Updated on: Jan 06, 2024 | 12:45 PM

రాష్ట్రమంతటా పెండింగ్ ట్రాఫిక్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంటే.. ఆ ట్రాఫిక్ ఎస్సై మాత్రం తన కలెక్షన్ల స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుల నుండి లంచం తీసుకున్న ఆ ట్రాఫిక్ ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. అతను లంచం తీసుకుంటున్న వీడియో పోలీస్ కమిషనర్ దృష్టికి చేరడంతో వారి పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సంఘటన హనుమకొండలో జరిగింది. హనుమకొండ ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న డేవిడ్ దర్జాగా లంచం తీసుకుంటూ ఒక వీడియోకి దొరికిపోయాడు.

హనుమకొండలోని ములుగు రోడ్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆ మార్గంలో ఇద్దరు యువకులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్నారు. కానిస్టేబుల్ వారిని పట్టుకొని సదరు ఎస్సై వద్దకు తీసుకొచ్చాడు. వారి పై చర్య తీసుకొని బుద్ది చెప్పాల్సిన ఎస్సై లంచానికి కక్కుర్తి పడ్డాడు. వాహ‌న‌దారుడి నుంచి లంచం తీసుకుంటుండగా అక్కడే బిల్డింగ్ పైన ఉన్న ఓ వ్యక్తి ఈ వ్యవహారం మొత్తం తన సెల్ ఫోన్‎లో షూట్ చేశాడు. లంచం తీసుకుంటున్న వీడియో సిటీ పోలీస్ కమిషనర్ దృష్టికి చేరడంతో ట్రాఫిక్ ఎస్సై డేవిడ్‌‎ను సస్పెండ్ చేస్తు వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లంచాల వ్యవహారంలో అతనికి సహరించిన కానిస్టేబుల్స్ పై కూడా విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..