AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్థరాత్రి లేడీస్‌ హాస్టల్‌లో డోర్‌ చప్పుళ్లు.. ఇంతకీ ఓయూలో ఎవరా అగంతకులు.?

ఓయూ లో విద్యార్థులకు రక్షణ లేదు అంటూ యువతులు ఆందోళన బాట పడుతున్నారు. అసలే సరైన సౌకర్యాలు లేవని ఆందోళన చేస్తుంటే, దీనికి తోడుగా విద్యార్ధినుల భద్రతా ఇప్పుడూ ప్రశ్నగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ క్యాంపస్లోకి చొరబడి అర్ధ రాత్రి డోర్ కొడుతునరంటు విద్యార్థినులు వాపోతున్నారు...

Hyderabad: అర్థరాత్రి లేడీస్‌ హాస్టల్‌లో డోర్‌ చప్పుళ్లు.. ఇంతకీ ఓయూలో ఎవరా అగంతకులు.?
OU Ladies Hostel
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jan 06, 2024 | 2:27 PM

Share

ఓయూ లో విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు.. హాస్టల్‌లో తమకు కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యల పై అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థినులు రోడ్ ఎక్కి ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో రోడ్ పైనే భోజనం చేసి నిరసన తెలిపారు.

ఓయూ లో విద్యార్థులకు రక్షణ లేదు అంటూ యువతులు ఆందోళన బాట పడుతున్నారు. అసలే సరైన సౌకర్యాలు లేవని ఆందోళన చేస్తుంటే, దీనికి తోడుగా విద్యార్ధినుల భద్రతా ఇప్పుడూ ప్రశ్నగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ క్యాంపస్లోకి చొరబడి అర్ధ రాత్రి డోర్ కొడుతునరంటు విద్యార్థినులు వాపోతున్నారు. ఎవరో ఇద్దరు అగంతకులు హాస్టల్‌లోకి వచ్చారని చెబుతన్నారు.

హాస్టల్‌ ఆవరణలో జనరేటర్‌ లేకోపవడం, వెలుతురు సరిగా లేక, దట్టమైన పొదలు, చెట్లు ఉండడంతో భద్రతపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బుధవాయం సాయంత్రం ఓ అజ్ఞాత వ్యక్తి గోడ దూకి హాస్టల్‌లోకి ప్రవేశించించనట్లు అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడు చెప్పడం ఆందోళన మరింత పెంచింది. అదే రోజు రాత్రి 7-8 గంటల సమయంలో వ్యక్తి అరుస్తూ, తలుపులు తట్టారని విద్యార్థినులు వాపోయారు. ఇంత జరిగినా సెక్యూరిటీ వెంటనే స్పందించలేదని ఆరోపించారు.

దీంతో తమకు సరైన భద్రత కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు హాస్టల్‌లో మెస్ అసలు బాగోలేదని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన చేస్తామని విద్యార్థినిలు హెచ్చరిస్తున్నారు. అయితే అగంతకులు తలుపు కొట్టిన ఘటన పై స్థానిక పోలీసులకు విద్యార్థులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.

దీంతో పోలీసులు సుమోటో కేసు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ పరిసరాల్లో ఉండే సీసీ కెమెరాలు దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమస్పథంగా ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు .

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..