Hyderabad: సురేందర్ ఎక్కడున్నాడు..? హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కలకలం..

హైదరాబాద్ రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయ్ కిడ్నాప్ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం రాత్రి నుంచి ప్రైవేట్ ఎంప్లాయ్ సురేందర్ కనిపించకుండా పోయాడు. దీంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు సురేందర్ కుటుంబ సభ్యులు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు సురేందర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Hyderabad: సురేందర్ ఎక్కడున్నాడు..? హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కలకలం..
Kidnap Case
Follow us
Vijay Saatha

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 05, 2024 | 10:00 PM

హైదరాబాద్ రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయ్ కిడ్నాప్ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం రాత్రి నుంచి ప్రైవేట్ ఎంప్లాయ్ సురేందర్ కనిపించకుండా పోయాడు. దీంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు సురేందర్ కుటుంబ సభ్యులు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు సురేందర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రాయదుర్గంలో గురువారం రాత్రి ప్రైవేటు ఎంప్లాయ్ సురేందర్ కిడ్నాప్ కు గురయ్యాడు. కాజాగూడ చెరువు వద్ద సురేందర్ ను అగంతకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. సురేందర్ తో పాటు ఉన్న మరో వ్యక్తి రాయదుర్గం పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించిన పోలీసులు సురేందర్ కిడ్నాప్ అయినట్టు ధృవీకరించారు. సురేందర్ ఆచూకీ కోసం పలుకోనాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సురేందర్ సెల్ ఫోన్ లొకేషన్ ను పోలీసులు ట్రేస్లో పెట్టారు. అయితే మొదట తన కుటుంబ సభ్యులతో సురేందర్ వాట్సాప్ కాల్ మాట్లాడినట్టు పోలీసులు చెబుతున్నారు. తన మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకుని కేవలం వైఫై ద్వారా మాత్రమే సురేందర్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టు పోలీసులు ధృవీకరించారు. అయితే ఇప్పటివరకు సురేందర్ ఎక్కడున్నాడు అనే అంశంపై ఒక స్పష్టత రాలేదు. కిడ్నాప్ సమయంలో సురేందర్ తో పాటు ఉన్న మరో వ్యక్తి గురించి పోలీసులు ఆరాధిస్తున్నారు.. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతాన్ని సైతం పోలీసులు గుర్తు చేస్తున్నారు.

కిడ్నాప్ సమయంలో సీసీ కెమెరాల్లో లభించిన కార్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం నలుగురు నిందితులు సురేందర్ కిడ్నాప్ సమయంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో ఒక వ్యక్తిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఉదాంతంలో ఫిర్యాదు చేసిన వ్యక్తినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కిడ్నాప్ సమయంలో పక్కనున్న వ్యక్తిని కాకుండా కేవలం సురేందర్ ను మాత్రమే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు కాబట్టి నిందితుల గురించి మరిన్ని వివరాల కోసం ఫిర్యాదు చేసిన వ్యక్తి నుండి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.

ఖాజాగూడ చెరువు సమీపంలో చోటు చేసుకున్న ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆరు బృందాలుగా విడిపోయిన పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాయదుర్గం నుండి మెహదీపట్నం మీదగా మహబూబ్నగర్ వైపు ఆ వాహనం వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. సురేందర్ కుటుంబ సభ్యుల నుండి సైతం పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. రేపటి కల్లా సురేందర్ రావు కిడ్నాప్ చేసిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..