Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరంలో పెరిగిన పోలీసుల బందోబస్తు.. హైసెక్యూరిటీ జోన్లు ఇవే..

పోలీసులు మరోవైపు డిమాండ్ల సాధికారత కోసం ధర్నాలు చేసేందుకు ఆందోళకారులు గన్ పార్క్ వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున అసెంబ్లీని కూడా హై సెక్యూరిటీ జోన్ గా పోలీసులు నిరంతరం గస్తీ లో ఉంటున్నారు.. అంతేకాకుండా గాంధీభవన్ , ధర్నా చౌక్ వద్ద ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. గతంలో కేవలం ప్రగతి భవన్ మరియు సచివాలయం వద్ద ఎక్కువగా పోలీస్ బందోబస్తు కనిపించేది కానీ ఇప్పుడు తదితర ప్లేసులు..

Hyderabad: నగరంలో పెరిగిన పోలీసుల బందోబస్తు.. హైసెక్యూరిటీ జోన్లు ఇవే..
Ts Police
Follow us
Vijay Saatha

| Edited By: Subhash Goud

Updated on: Jan 05, 2024 | 9:30 PM

కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో నగరం లో పలు ప్రదేశాలు హై సెక్యురిటి జోన్లు గా మారాయి. గత ప్రభుత్వం లో కేవలం రెండు ప్రదేశాలు మాత్రమే సెక్యూరిటీ జోన్లు గా ఉండేవి. ఇప్పుడు అవి కాస్త ఎక్కువ అయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా పోలీస్ భద్రత కనిపిస్తుంది. సీఎం రేవంత్ నివాసం, సచివాలయం, ప్రజాభవన్, గాంధీ భవన్, ధర్నా చౌక్, అసెంబ్లీ ఇవే ప్రస్తుతం పోలీసుల భారీ బందో బస్తు చేసిన ప్రదేశాలు. సీఎం తన నివాసం నుండి సచివాలయం, గాంధీ భవన్ ఎటు వెళ్ళాలి అన్నా భద్రత కచ్చితం. దింతో వచ్చి పోయి ప్రతి రూట్ ను పోలీసులు తమ అధీనం లోకి తీసుకుంటున్నారు. ఓ వైపు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసం వద్ద నిరంతరం సెక్యూరిటీ తో పాటు వెళ్ళేవరకు సీఎం ఎటు వెళ్లిన భద్రత ఉంటుంది.

ప్రతి రోజు సీఎం తో సహా మంత్రులు సచివాలయం వద్దకు రావడం తో అక్కడ కూడా సుమారు 200పైగా పోలీసులు పహారాలో ఉంటున్నారు. సచివాలయంలో పరిధి లోనే హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, అమరవీరుల స్థూపం లాంటి ప్రదేశాలు ఉండటం తో చాలా మంది ప్రర్యటకులు అక్కడకి వస్తూ ఉంటారు. అదే సమయం లో సచివాలయంలో సీఎం తో సహా మంత్రులు ఉండటం తో భారీ భద్రత ప్రతి రోజు కనిపిస్తూ ఉంటుంది.ఇ క్కడ నిరంతరం పోలీసులగా నిఘా ఉంటుంది.

సచివాలయం తరువాత ప్రజాభవన్.. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజా భవన్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దింతో సుదూర ప్రాంతాల నుండి వివిధ రకాల సమస్యలతో ప్రజా భవన్ కు ప్రజలు తరలిరావడంతో ప్రతి మంగళ శుక్రవారాలలో ప్రజాభవన్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హై సెక్యూరిటీ ని కలిపిస్తున్నారు పోలీసులు. అక్కడే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసం కూడా ఉండడంతో మరింత ఫోకస్ గా ప్రజాభవన్ ఉంటుంది. దీంతో పోలీసులు ప్రజా దర్బార్ లేని సమయంలో కూడా సెక్యూరిటీ జోన్ గా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక మరోవైపు అసెంబ్లీ వద్దకు మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రావడంతో మూడంచెల భద్రతను అసెంబ్లీ ప్రాంగణంలో ఉంచుతున్నారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు మరోవైపు డిమాండ్ల సాధికారత కోసం ధర్నాలు చేసేందుకు ఆందోళకారులు గన్ పార్క్ వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున అసెంబ్లీని కూడా హై సెక్యూరిటీ జోన్ గా పోలీసులు నిరంతరం గస్తీ లో ఉంటున్నారు.. అంతేకాకుండా గాంధీభవన్ , ధర్నా చౌక్ వద్ద ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. గతంలో కేవలం ప్రగతి భవన్ మరియు సచివాలయం వద్ద ఎక్కువగా పోలీస్ బందోబస్తు కనిపించేది కానీ ఇప్పుడు తదితర ప్లేసులు హై సెక్రెటరీ జోన్లుగా మారడంతో ఎక్కడ చూసినా పోలీసుల భద్రత కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..