Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Party: ‘నిత్యవసర ధరలు పెరుగుదలకు కారణం కాంగ్రెస్ పాలన గాడి తప్పడమే’: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రుణమాఫీ ఏమయింది ? రైతుబంధు నిధులు ఎక్కడికి పోయాయి ? అని ప్రశ్నించారు. దేశంలో రైతులను హోల్ సేల్ గా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని దుయ్యబట్టారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి ఎన్ని రోజులు సాగదీస్తారు ? అని నిలదీశారు. రైతుబంధు నిధుల విడుదల గురించి మేధావులు ఎందుకు స్పందించడం లేదన్నారు.

BRS Party: 'నిత్యవసర ధరలు పెరుగుదలకు కారణం కాంగ్రెస్ పాలన గాడి తప్పడమే': మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Former Minister Niranjan Re
Follow us
Srikar T

|

Updated on: Jan 06, 2024 | 6:37 AM

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రుణమాఫీ ఏమయింది ? రైతుబంధు నిధులు ఎక్కడికి పోయాయి ? అని ప్రశ్నించారు. దేశంలో రైతులను హోల్ సేల్ గా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని దుయ్యబట్టారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి ఎన్ని రోజులు సాగదీస్తారు ? అని నిలదీశారు. రైతుబంధు నిధుల విడుదల గురించి మేధావులు ఎందుకు స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో ఎంత మంది రైతుల వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చారని అడిగారు. డిసెంబరు 9 నాడు రైతులందరి ఖాతాలలో ఎకరాకు రూ.15 వేలు రైతుబంధు ఇస్తాం అన్నారు. రుణమాఫీ అయిన వాళ్లు మళ్లీ రూ.2 లక్షల రుణం తెచ్చుకుంటే డిసెంబరు 9 నాడు రుణమాఫీ చేస్తాం అన్నారు. ఇచ్చిన హామీ ఏమైందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 29 రోజులు అయింది. రైతు బంధు సాయం అకౌంట్లలో వేయడం మొదలు పెట్టి 27 రోజులు కావొస్తోంది. ఇప్పటికి ఒక ఎకరం ఉన్న రైతులకు పూర్తిగా డబ్బులు ఖాతాల్లో వేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేము 11 పర్యాయాలు రైతు బంధు పథకం కింద రూ.72 వేల కోట్లు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పుకొచ్చారు. ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అలా వ్యవహరించడం లేదని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చి విపరీతంగా పెరిగిపోయాయన్నారు. బియ్యం రేట్లు, కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. సన్నబియ్యం ఇస్తామని ఉన్న బియ్యం ధరలు పెంచారన్నారు. మార్కెట్ లో సన్నబియ్యం ధర కిలో రూ.60 నుండి రూ.64 కు పెరిగిందని చెప్పారు.బ్లాక్ మార్కెట్ ను నియంత్రించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన గాడిలో లేకపోవడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..