Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..స్పెషల్‌ డేటా ప్యాక్‌.. 12 ఓటీటీలు..10జీబీ డేటా

ఇతర టెలికాం కంపెనీలకు పోటీగా జియో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను తీసుకువస్తూ వినియోగదారులను పెంచుకుంటోంది. ప్రస్తుతం చాలా మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. వారికి ఎంత డేటా ఉన్న సరిపోని పరిస్థితి ఉంది. అలాంటి వారికి డేటా ప్యాక్‌ను ప్రవేశపెడుతోంది. ఇటీవల జియో రూ.148తో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో 12 ఓటీటీలు లభించేలా..

Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..స్పెషల్‌ డేటా ప్యాక్‌.. 12 ఓటీటీలు..10జీబీ డేటా
Jio Plan
Follow us
Subhash Goud

|

Updated on: Jan 04, 2024 | 9:45 PM

రిలయన్స్‌ జియో వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల రీఛార్జ్‌ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇతర టెలికాం కంపెనీలకు పోటీగా జియో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను తీసుకువస్తూ వినియోగదారులను పెంచుకుంటోంది. ప్రస్తుతం చాలా మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. వారికి ఎంత డేటా ఉన్న సరిపోని పరిస్థితి ఉంది. అలాంటి వారికి డేటా ప్యాక్‌ను ప్రవేశపెడుతోంది. ఇటీవల జియో రూ.148తో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో 12 ఓటీటీలు లభించేలా రూపొందించింది.

అయితే ప్లాన్‌ కేవలం రూ.148 ప్లాన్‌ డేటా ప్యాక్‌ మాత్రమే. ఇందులో కాల్స్‌ గానీ, ఎస్‌ఎంఎస్‌లు గానీ ఉండవు. ఈ ప్లాన్‌లో మొత్తం 10 జీబీ డేటా లభిస్తుండగా, వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. ఈ ప్యాక్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే బేస్‌ ప్లాన్‌ తప్పకుండా ఉండాల్సిందేనని జియో స్పష్టం చేస్తోంది. ఈ ప్లాన్‌ తీసుకున్న వారికి జియో సినిమా ప్రీమియం, జీ 5, సోనీలివ్‌, డిస్కవరీ+, లయన్స్‌గేట్‌, సన్‌నెక్ట్స్‌ సహా మొత్తం 12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తాయని జియో వెల్లడించింది. ఈ ఓటీటీలన్ని కూడా జియో టీవీ ప్రీమియంలో భాగంగా వీక్షించవచ్చు. అంతేకాకుండా జియో సినిమా ప్రీమియం కూపన్‌ మైజియో అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్‌ చేసుకోవచ్చు. డేటా వినియోగించుకునే వారు ఈ ప్లాన్‌ ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..