Tax Benefits: మీరు ట్యాక్స్ చెల్లిస్తున్నారా? కొత్త, పాత పన్ను విధానాల్లో దేనితో ఎక్కువ లాభం?

2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పెంచారు. పన్ను స్లాబ్‌ల సంఖ్య 6 నుండి 5కి తగ్గించారు .రిబేట్ తర్వాత, రూ. 7 లక్షల వరకు ఆదాయం పన్ను నుండి మినహాయించారు. జీతం పొందే వ్యక్తులకు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తారు. అధిక సంపాదన ఉన్నవారికి..

Tax Benefits: మీరు ట్యాక్స్ చెల్లిస్తున్నారా? కొత్త, పాత పన్ను విధానాల్లో దేనితో ఎక్కువ లాభం?
Tax
Follow us
Subhash Goud

|

Updated on: Jan 03, 2024 | 2:40 PM

చాలా మంది పాత పన్ను విధానాన్నే ఎంచుకున్నారు. ఈ బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త పన్ను విధానంలో పన్ను తక్కువగానే ఉంది.. అయినా ప్రజలు ఇప్పటికీ పాత పన్నుల విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు?

మనీ9 సర్వే ప్రకారం, ఆదాయపు పన్ను చెల్లించే 63 శాతం మంది వ్యక్తులు పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారు. 37 శాతం మంది కొత్త పన్ను విధానాన్ని కోరుకుంటున్నారు. పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఇష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా 350 నగరాలకు చెందిన 1,263 మంది వ్యక్తులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వే ప్రకారం, 71 శాతం మంది ప్రజలు.. చాలా లెక్కల ఆధారంగా పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. మహిళలలో 74 శాతం మంది, పురుషులలో ఈ 71 శాతం మంది రెండు పన్ను విధానాల కింద పన్ను విధింపును లెక్కవేశారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పెంచారు. పన్ను స్లాబ్‌ల సంఖ్య 6 నుండి 5కి తగ్గించారు .రిబేట్ తర్వాత, రూ. 7 లక్షల వరకు ఆదాయం పన్ను నుండి మినహాయించారు. జీతం పొందే వ్యక్తులకు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తారు. అధిక సంపాదన ఉన్నవారికి సర్‌ఛార్జిని తగ్గించారు. అయినా పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని వీడాలనుకోలేదు. దీనికి కారణం ఏమిటి…? ప్రజలు పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానానికి ఎందుకు వెళ్లకూడదనుకోవడం లేదు? కొత్త పన్ను విధానంలో పన్ను రేటు తక్కువగా ఉన్నా.. ఎవరికి ఏ పన్ను విధానం సరైనది? ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్స్.. అంటే ఐటీఆర్ దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల 40 లక్షల మందికి పైగా రిటర్న్‌లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్‌లో పార్లమెంటుకు తెలిపింది. దాదాపు మూడింట రెండు వంతుల మంది అంటే 5.16 కోట్ల మంది పన్ను చెల్లించలేదు. అంటే వారి పన్ను సున్నా. సో, మొత్తం 2 కోట్ల 24 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లించారు.

ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను రేట్లను తక్కువగా ఉంచింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కూడా కొత్త పన్ను విధానంలో మార్పులు జరిగాయి. కొత్త విధానం ఇప్పుడు డిఫాల్ట్ ఎంపికగా మారింది. పాత పన్ను విధానం ప్రయోజనాలను పొందడానికి, మీరు దానిని ఎంచుకోవలసి ఉంటుంది. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా, పన్ను చెల్లింపుదారులలో చెప్పుకోదగ్గ ముద్ర వేయలేకపోయింది. పాత పన్ను విధానాన్నే ఇప్పటికీ ఎక్కువమంది పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు.

వ్యక్తులు పాత పన్నుల విధానాన్ని ఇష్టపడడానికి గల కారణాల గురించి ఇప్పుడు మాట్లాడుదాం. పాత పన్ను విధానంలో ఇంటి అద్దె అలవెన్స్ (HRA), LTA, 80C, 80D, హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపు, NPSతో సహా దాదాపు 70 మినహాయింపులు ఉన్నాయి. పన్ను విధించదగిన ఆదాయంతో పాటు పన్నును తగ్గించడంలో సహాయపడే మినహాయింపులు ఉన్నాయి. ఇది కాకుండా, పొదుపు అలవాటును పెంపొందించడం, EPF-PPF & NPS వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి పన్ను రహిత రాబడిని పొందడం, పదవీ విరమణ కోసం డబ్బును పొదుపు చేయడం వంటి కారణాల వల్ల పాత పన్నుల విధానాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు.

చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే… పాత పన్ను విధానంలో ఉన్న కొన్ని సాధారణ మినహాయింపులు, తగ్గింపుల గురించి మాట్లాడుకుందాం.

అన్నింటిలో మొదటిది, ఉద్యోగుల భవిష్య నిధి (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), జీవిత బీమా వంటి వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80Cలో రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు తీసుకోవచ్చు. ఇది కాకుండా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై అదనంగా రూ.50 వేలు మినహాయింపు ఉంటుంది. ఈ విధంగా, రూ. 2 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా అవుతుంది.

అదేవిధంగా, సెక్షన్ 80డిలో ఆరోగ్య బీమా ప్రీమియం కోసం మినహాయింపు ఉంది. పాలసీదారుతోపాటు, భార్య, పిల్లల పాలసీ ప్రీమియంపై రూ. 25,000 తగ్గింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ.50 వేలు. మీరు, మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే, మీరు రూ. 1 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హౌస్ రెంట్ అలవెన్స్. అంటే HRA కింద ఇంటి అద్దెపై మినహాయింపు తీసుకోవచ్చు. హెచ్‌ఆర్‌ఏగా స్వీకరించిన అసలు మొత్తం… – మెట్రో సిటీలో బేసిక్ జీతంలో 50 శాతం, నాన్ మెట్రో సిటీలో 40 శాతం – వార్షిక ఇంటి అద్దె నుండి వార్షిక జీతంలో 10% మినహాయించిన తర్వాత మిగిలి ఉన్న మొత్తం. మూడింటిలో తక్కువగా ఉన్న వాటిపై మినహాయింపు తీసుకోవచ్చు.

ఇది కాకుండా, సెక్షన్ 24 కింద, గృహ రుణ వడ్డీపై రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. పాత పన్ను విధానం సురక్షిత జీవితం, ఆరోగ్యం, పదవీ విరమణ ప్రణాళిక, దీర్ఘకాలిక సంపద సేకరణతో పాటుగా పన్ను పొదుపును ప్రోత్సహిస్తుంది. కొత్త పన్ను విధానం.. మిమ్మల్ని సంపాదించమని.. దానిపై తక్కువ ట్యా్క్స్ కట్టమని అంటుంది. భవిష్యత్తు పొదుపు మీ చేతుల్లోనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5.5 కోట్ల మంది ప్రజలు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చని రెవెన్యూ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ పన్ను చెల్లింపుదారులలో ఎక్కువ మంది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటుంది. అయితే మీరు పన్నును ఆదా చేయడానికి ఎలాంటి పెట్టుబడి పెట్టకూడదనుకుంటే, మీరు కొత్త పన్ను విధానానికి వెళ్లవచ్చు. ఇక్కడ పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మినహాయింపులు, తగ్గింపులు లేవు. మీకు గృహ రుణం ఉంటే, HRA, 80C, NPS ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం