Vande Bharat: ప్రజాదరణ పొందుతున్న ఈ నాలుగు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు అనుకూలమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణoగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలు ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో పూర్తి సిట్టింగ్ ఏసీ సదుపాయాలతో పగటిపూట ప్రయాణాన్ని అందిస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ రైలులో జీపీఎస్‌ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీ సీ టివీ కెమెరాలు,

Vande Bharat: ప్రజాదరణ పొందుతున్న ఈ నాలుగు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు
Vande Bharat Trains
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2024 | 4:23 PM

దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ స్టేషన్ల నుండి ప్రారంభించబడిన నాలుగు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు డిసెంబర్ 2023లో ఎంతో ఆదరణ పొందాయి. వందే భారత్ ఎక్ప్‌ప్రెస్‌ రైళ్లకు భారీ ప్రజాదరణ దక్షిణ మధ్య రైల్వే అంతటా విశేష గుర్తింపు పొందింది. దీనికి అదనముగా దక్షిణ మధ్య రైల్వే లో జాల్నా నుంచి ముంబై సీఎస్టిఎమ్ వరకు మరొక వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ప్రవేశపెట్టారు. అలాగే రైలు జనవరి 1 నుంచి ముంబై నుండి ప్రారంభమవుతుంది. దక్షిణ మధ్య రైల్వేఅంతటా నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్ల జాబితా, వాటి ఆక్యుపెన్సీ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

  1. సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ ప్రెస్: జనవరి 2023లో ప్రవేశపెట్టిన 16 కోచ్‌లతో సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. డిసెంబర్ 2023లో సికింద్రాబాద్ – విశాఖపట్నం ఆక్యుపెన్సీ 134% వద్ద ఉండగా, విశాఖపట్నం – సికింద్రాబాద్ ఎక్స్‌ ప్రెస్ 143% వద్ద ఉంది.
  2. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ ప్రెస్: ఏప్రిల్ 2023లో 8 కోచ్‌లతో కూడిన సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ కూడా ప్రవేశపెట్టినప్పటి నుండి పూర్తి ఆక్యుపెన్సీతో స్థిరంగా కొనసాగుతోంది. అపారమైన స్పందన కారణంగా ఈ రైలుకు మే 17, 2023 నుండి కోచ్‌లు 16 కోచ్‌లకు పెంచారు. డిసెంబర్ 2023లో సికింద్రాబాద్ – తిరుపతి ఎక్స్‌ ప్రెస్ ఆక్యుపెన్సీ 114% కాగా, తిరుపతి – సికింద్రాబాద్ ఎక్స్‌ ప్రెస్ 105% వద్ద ఉంది.
  3. కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్: సెప్టెంబర్, 2023లో ప్రవేశపెట్టిన 8 కోచ్‌లతో కూడిన కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ కూడా ప్రజాదరణ పొందింది. అలాగే గత ఏడాది డిసెంబర్లో రైలు ఆక్యుపెన్సీ 107% వద్ద ఉండగా తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఆక్యుపెన్సీ 110% వద్ద ఉంది.
  4. విజయవాడ- ఎంజీఆర్‌ చెన్నై – వందే భారత్ ఎక్స్‌ ప్రెస్: విజయవాడ – ఎంజీఆర్‌ చెన్నై – వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ 8 కోచ్‌లతో సెప్టెంబరు, 2023లో ప్రవేశపెట్టిన ప్రపంచ ప్రసిద్ధ యాత్రికుల గమ్యస్థానమైన తిరుపతిని కలుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ రైలు ఆక్యుపెన్సీ 126%గా నమోదు కాగా, ఎంజీఆర్‌ చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 119%గా నమోదైంది.
  5. ఇవి కూడా చదవండి

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు అనుకూలమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణoగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలు ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో పూర్తి సిట్టింగ్ ఏసీ సదుపాయాలతో పగటిపూట ప్రయాణాన్ని అందిస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ రైలులో జీపీఎస్‌ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీ సీ టివీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్ఇడి లైటింగ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి. తద్వారా మెరుగైన ప్రయాణ సౌకర్యం, మరింత భద్రతను అందిస్తాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడవడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. జోన్లో వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టిన భారతదేశ స్వదేశీ సెమీ-హై స్పీడ్ రైలుకు అపారమైన ప్రజాదరణను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడం రైల్వే ప్రధాన లక్ష్యమని, రైలు ప్రయాణీకుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతాయని అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!