Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Selling Cars: 2023లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్‌లో టాప్ ఎవరంటే..

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశంలో ఏడాది పూర్తయ్యే నాటికి ఒక కోటి ఈవీలు అమ్మకాలు చేసే అవకాశం ఉందని, 2030 నాటికి ఇది దాదాపు ఐదు కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న డేటా బేస్ ప్రకారం మన దేశంలో ఇప్పటి వరకూ 34.54 లక్షల ఈవీలు రిజిస్టర్ అయినట్లు మంత్రి వివరించారు.

Top Selling Cars: 2023లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్‌లో టాప్ ఎవరంటే..
Mahindra Xuv400
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 01, 2024 | 2:56 PM

ఆటో మొబైల్ రంగానికి 2023 సంవత్సరం ఫుల్ జోష్ ఇచ్చింది. టాప్ బ్రాండ్ల కార్లు గణనీయమైన విక్రయాలు చేశాయి. పండుగల సీజన్ తో పాటు ఓవరాల్ గా కార్ల విక్రయాలు ఈ ఏడాది బాగా జరిగాయి. బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ గా మాత్రం మహీంద్రా నిలించింది. ఈ బ్రాండ్ పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాదు.. ఎలక్ట్రిక్ వాహనాలు ఈ బ్రాండ్ నుంచి అత్యధికంగా అమ్ముడయ్యాయి. వాస్తవానికి మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశంలో ఏడాది పూర్తయ్యే నాటికి ఒక కోటి ఈవీలు అమ్మకాలు చేసే అవకాశం ఉందని, 2030 నాటికి ఇది దాదాపు ఐదు కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న డేటా బేస్ ప్రకారం మన దేశంలో ఇప్పటి వరకూ 34.54 లక్షల ఈవీలు రిజిస్టర్ అయినట్లు మంత్రి వివరించారు. 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్లలో మహీంద్రాతో పాటు టాటా మోటార్స్, ఎంజీ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టాటా నెక్సన్ ఈవీ..

మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటి. దీనిలో 40.5కేడబ్ల్యూహెచ్ హై ఎనర్జీ డెన్సిటీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. దీని చార్జింగ్ సమయం ఆరు గంటలు. ఫుల్ చార్జ్ చేస్తే 465 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ వాహనం 9 సెకన్లలోపే గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ. 14.7 లక్షల నుంచి రూ. 19.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

ఎంజీ కామెట్ ఈవీ..

ఎంజీ మోటార్స్ నుంచి కామెట్ ఈవీ మన దేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. దీని ధర రూ. 7.98 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ కెపాసిటీ 17.3 కేడబ్ల్యూ, సింగిల్ చార్జ్ పై 230 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఇది ఫుల్ చార్జ్ అవడానికి 5.5 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

హ్యుందాయ్ ఐయోనిక్ 5..

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ నుంచి వచ్చిన ఐయానిక్5 ధర రూ. 45.95 లక్షలుగా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 72.6 కేడబ్ల్యూహెచ్ గా ఉంది. ఇది సింగిల్ చార్జ్ పై గరిష్టంగా 631 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ వాహనం కేవలం 7.6 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలగుతుంది. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400..

మహీంద్రా నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ వాహనం ధర 15.99 లక్షల నుంచి19.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. దీనిలో రెండు వేరియంట్లు ఎక్స్ యూవీ400ఈసీ, ఎక్స్ యూవీ400 ఈఎల్ ఉన్నాయి. వీటి బ్యాటరీ సామర్థ్యాలు 34.5కేడబ్ల్యూహెచ్, 39.4కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. దీనిని ఫుల్ చార్జ్ చేస్తే 375-456 కి.మీ దూరం ప్రయాణించగలగుతుంది.

సిట్రోయెన్ ఈసీ3..

ఈ కారు ధర రూ. 11.61లక్షల నుంచి రూ. 12.79లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిలోని బ్యాటరీ సామర్థ్యం 29.2కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 320కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవడానికి కనీసం 10 గంటల సమయం తీసుకుంటుంది. అదే డీసీ సాకెట్ అయితే 57 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఇది 6.8 సెకండ్లలోనే 0 నుంచి 60కిమీ వేగాన్ని అందుకోగలగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..