కోడి గుడ్డు ధర పైపైకి.. మరింత పెరిగే అవకాశం
రాష్ట్రంలో కోడి గుడ్డు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ కోడిగుడ్డు భారమవుతోంది. కొత్తగా కోడిగుడ్డు ధర తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. వారం రోజుల్లోనే డజన్ కోడిగుడ్ల ధర ఏకంగా 18 రూపాయలు పెరిగింది. గతంలో డజను కోడిగుడ్ల ధర 66 రూపాయలు ఉంటే ఇప్పుడు 84 రూపాయలకు చేరింది. ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు ధర 7 రూపాయలు పలుకుతోంది. కోళ్ల దాణా ధరలు పెరగడమే గుడ్డు రేటు పెరగడానికి కారణమంటున్నారు కోళ్లఫారమ్ నిర్వాహకులు.
రాష్ట్రంలో కోడి గుడ్డు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ కోడిగుడ్డు భారమవుతోంది. కొత్తగా కోడిగుడ్డు ధర తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. వారం రోజుల్లోనే డజన్ కోడిగుడ్ల ధర ఏకంగా 18 రూపాయలు పెరిగింది. గతంలో డజను కోడిగుడ్ల ధర 66 రూపాయలు ఉంటే ఇప్పుడు 84 రూపాయలకు చేరింది. ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు ధర 7 రూపాయలు పలుకుతోంది. కోళ్ల దాణా ధరలు పెరగడమే గుడ్డు రేటు పెరగడానికి కారణమంటున్నారు కోళ్లఫారమ్ నిర్వాహకులు. కోళ్ల దాణా గతంలో కిలో 15 నుంచి 17 రూపాయలు ఉండేదని, ఇప్పడు అది 28 రూపాయలకి పెరిగిందంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు గుడ్ల ఉత్పత్తి లేకపోవడంతో కోడి గుడ్ల ధర పెంచక తప్పడం లేదని కోళ్ల ఫారమ్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు కోడి గుడ్ల రవాణా కూడా భారంగా మారిందని, ఇదికూడా గుడ్డు ధర పెరగడానికి మరో కారణంగా చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు
Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.
ఫ్రీ అని బస్సెక్కారు.. సీట్ల కోసం సిగపట్లు పట్టారు
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

