Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.

అయోధ్య రాముడు ఎలా ఉంటాడు. ఆయన రూపు ఎలా ఉంటుంది? ఇది కూడా ఖరారు అయింది. అయోధ్యలో కొలువుదీరే దీవెనలు ఇచ్చే రాముడు, శ్యామవర్ణంలో ఉంటాడు. మనం సినిమాల్లో చూసే రాముడి రంగే ఈ విగ్రహానికి ఉంటుంది. తద్వారా రాముడి పౌరాణిక, చారిత్రక వైభవానికి తగినట్లుగా రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అంటే, శ్యామవర్ణంలోని బాలరాముడిని అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నారు.

Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.
Ayodhya Ram Mandir
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2024 | 3:13 PM

కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. అయోధ్యలో రూపుదిద్దుకున్న భవ్య రామమందిరంలో కొలువుదీరే బాలరాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది. ఐదేళ్ల వయసున్న చిన్నిరాముడి విగ్రహానికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈనెల 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. అందుకోసం అంతా రెడీ అయింది .

అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఖరారు అయింది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌, ఈ రాముడి విగ్రహ నమూనాను ఖరారు చేసింది. అయితే ఇందుకోసం మూడు విగ్రహ నమూనాలను ట్రస్ట్‌ సభ్యులు పరిశీలించారు. ఐదేళ్ల వయసున్న రాముడి విగ్రహానికి, దైవత్వం ఉట్టిపడేలా ఉన్న శిల్పాన్ని ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతానికి ఎంపిక చేసిన నమూనాను ప్రకటించలేదు. విగ్రహ ప్రాణప్రతిష్ఠనాడే ఆ విగ్రహాన్ని చూడటం వీలవుతుంది. అయోధ్య రాముడు ఎలా ఉంటాడు. ఆయన రూపు ఎలా ఉంటుంది? ఇది కూడా ఖరారు అయింది. అయోధ్యలో కొలువుదీరే దీవెనలు ఇచ్చే రాముడు, శ్యామవర్ణంలో ఉంటాడు. మనం సినిమాల్లో చూసే రాముడి రంగే ఈ విగ్రహానికి ఉంటుంది. తద్వారా రాముడి పౌరాణిక, చారిత్రక వైభవానికి తగినట్లుగా రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అంటే, శ్యామవర్ణంలోని బాలరాముడిని అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నారు.

ఇక అయోధ్య రాముడి విగ్రహం ఎత్తు ఎలా ఉంటుందో చూడండి. ఈ అపురూపమైన విగ్రహం 51 అంగుళాల ఎత్తులో ఉంటుంది. 51 అంగుళాలు అంటే, నాలుగు అడుగులకు కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విగ్రహ నమూనా, రంగు, ఎత్తు అన్నవి ఖరారు అయిపోయాయి. విగ్రహం సరే.. ఆ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి ఎవరు? ఆ అదృష్టవంతుడు ఎవరు? ఈ విగ్రహాన్ని రూపొందించిన వ్యక్తి పేరు అరుణ్‌ యోగిరాజ్‌. ఈయన మైసూరుకు చెందిన శిల్పి. ఈయన ఆషామాషీ వ్యక్తి కాదు. కేదార్‌నాథ్‌లో మొన్నామధ్య ప్రధాని మోదీ ప్రారంభించిన ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని మలిచింది కూడా ఇతడేనట.అంతేగాదు, ఢిల్లీలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని కూడా ఈయనే రూపొందించారు.

అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహాన్ని యోగిరాజ్‌, ఆరునెలల్లో తయారుచేశారు. రాముడి దైవత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబేలా ఈ విగ్రహాన్ని మలిచారీయన.  రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ మూడు విగ్రహాలను పరిశీలించింది. యోగిరాజ్‌ రూపొందించిన విగ్రహాన్ని ఫైనల్‌ చేసింది. కానీ మిగతా రెండు విగ్రహాల పరిస్థితి ఏంటి? దీనికి కూడా సమాధానం వచ్చింది. మూడు విగ్రహాల్లో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచితే, మరో రెండు విగ్రహాలను కూడా అయోధ్య ఆలయంలోనే ఏర్పాటు చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే