AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూ బకాసురుల పంజా.. నీళ్లున్న చెరువు రాత్రికి రాత్రే మాయం.. ఎక్కడంటే?

ఇదంతా ల్యాండ్ మాఫియా పనిగా స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడి ప్రజలు చేపలు పట్టడం, తోటల పెంపకం కోసం ఈ చెరువు నీటిపై ఆధారపడి ఉన్నారు. అయితే, ఇప్పుడు తెల్లవారే సరికి చెరువు మాయం కావటంపై ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని అవాక్కయ్యారు. అయితే ఇక్కడ చెరువును ఆక్రమించింది ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియలేదు.

భూ బకాసురుల పంజా.. నీళ్లున్న చెరువు రాత్రికి రాత్రే మాయం.. ఎక్కడంటే?
Land Mafia
Jyothi Gadda
|

Updated on: Jan 01, 2024 | 3:25 PM

Share

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. కాదేదీ చోరీలకు అనర్హం అంటున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సాధారణంగా డబ్బు, నగలు, వజ్రాలు, విలువైన పత్రాలు, టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను అదును చూసి ఎత్తుకెళ్తుంటారు దొంగలు. కానీ, ఇక్కడో వింత దొంగతనం జరిగింది. దొంగలు ఏం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. రాత్రి రాత్రికే నిండా నీళ్లు ఉన్న చెరువునే మాయం చేశారు.. రాత్రి నీళ్లతో ఉన్న చెరువు తెల్లవారే సరికి మాయం కావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన దర్బంగా జిల్లాలో జరిగింది. గతంలో బీహార్ లో 60 అడుగుల పొడవు ఉన్న బ్రిడ్జీని, రైలు ఇంజన్, చివరికి రోడ్డును కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. ఈసారి ఏకంగా ఓ చెరువునే రాత్రికి రాత్రి మాయం చేశారు. అంతేకాదు ఆ స్థలంలో ఓ గుడిసెను వేయడం మరో విశేషం. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అప్పటి వరకు అక్కడ కనిపించిన చెరువు తెల్లవారే సరికి మట్టితో నిండిపోయింది. ఉదయం లేచి చూసేసరికి చెరువు మాయం కావటమే కాదు.. ఏకంగా ఓ గుడిసె కూడా కనిపించటంతో ప్రజలు షాక్‌ అవుతున్నారు. ఇదంతా ల్యాండ్ మాఫియా పనిగా స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడి ప్రజలు చేపలు పట్టడం, తోటల పెంపకం కోసం ఈ చెరువు నీటిపై ఆధారపడి ఉన్నారు. అయితే, ఇప్పుడు తెల్లవారే సరికి చెరువు మాయం కావటంపై ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని అవాక్కయ్యారు. అయితే ఇక్కడ చెరువును ఆక్రమించింది ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియలేదు.

ఘటన జరిగిన ప్రదేశంలో రాత్రిపూట లారీల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 10 నుంచి 15 రోజులుగా రాత్రిపూట లారీలు తిరుగుతున్నాయి. ఇదీ కాకుండా చాలా యంత్రాలు కూడా వచ్చి వెళ్తున్నాయని చెప్పారు స్థానికులు. కానీ, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలేదని చెప్పారు. ఈ పనులన్నీ రాత్రిపూట జరిగాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఆ భూమి ఎవరిది? ఆ గుడిసె ఎవరిది? అనేది ఇంకా ఎవరికీ తెలియదని డీఎస్పీ కుమార్ తెలిపారు. ఈ వింత ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు దొరికిన తర్వాతే దీని వెనుక నిజం బయటపడనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌