Covid-19: ప్రతాపం చూపిస్తోన్న కొత్త వేరియంట్‌ జేఎన్‌-1.. పదిరోజులుగా కొత్త కొవిడ్‌ కేసులు..

ఈ వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వైరస్‌ సోకిన వారిలో చాలా మంది కోలుకోవడం ఉపశమనం కలిగించే అంశమంటున్నారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా ‍వ్యాక్సిన్‌ డోస్‌లు వేశారు.

Covid-19: ప్రతాపం చూపిస్తోన్న కొత్త వేరియంట్‌ జేఎన్‌-1.. పదిరోజులుగా కొత్త కొవిడ్‌ కేసులు..
Covid 19
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 31, 2023 | 9:40 PM

కొవిడ్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత పదిరోజుల్లో రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే 19న 865 కేసులు నమోదు కాగా 227 రోజుల గ్యాప్‌ తరువాత గత 24 గంటల్లో అత్యధికంగా 841 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 5 వరకు రోజూ రెండు అంకెల సంఖ్యలో కరోనా కేసులు నమోదవగా.. ప్రస్తుతం శీతల వాతావరణం కారణంగా వాటి సంఖ్య పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి పెరిగింది.

గత 4 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మంది కొవిడ్‌ బారిన పడగా, 5.3 లక్షల మంది కన్నుమూశారు. కరోనాలోని కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వైరస్‌ సోకిన వారిలో చాలా మంది కోలుకోవడం ఉపశమనం కలిగించే అంశమంటున్నారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా ‍వ్యాక్సిన్‌ డోస్‌లు వేశారు.

మరోవైపు వరంగల్‌ ఎంజీఎం వైద్యులు కొవిడ్‌ బులెటిన్ విడుదల చేశారు. డిసెంబర్ 21 నుంచి ఇప్పటివరకు 25 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 179 శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపగా 25 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. బాధితుల్లో ఆరుగురు చిన్నారులున్నారు. వీరికి కొవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కోవిడ్ కేసుల విజృంభణ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎంజీఎం సూపరింటెండెంట్, వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కొవిడ్‌ బాధితులకు అందుతున్న సేవలపై మంత్రి ఆరా తీశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..