Man Ki Baat: ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ప్రధాని మోదీ.. 2023 చివరి ‘మన్ కీ బాత్’లో కీలక వ్యాఖ్యలు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కోసం దేశం ఆత్రుతగా ఎదురు చూస్తుందన్నారు ప్రధాని . శ్రీరాముడు, అయోధ్యపై కొత్త పాటలు, భజనలు, కవితలు వస్తున్నాయన్నారు. భారత చరిత్రలో ఇది కీలక ఘట్టమన్నారు. ప్రజలు తమ సృజనాత్మకను సోషల్ మీడియాలో ‘#శ్రీరామభజన్’తో పంచుకోవాలని కోరారు. 2023 చివరి ‘మన్ కీ బాత్’లో భాగంగా భారత్ సాధించిన విజయాలను ఆయన గుర్తు చేశారు.
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందన్నారు. అభివృద్దిని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. 2023 చివరి ‘మన్ కీ బాత్’లో భాగంగా భారత్ సాధించిన విజయాలను ఆయన గుర్తు చేశారు. చాలా కాలం పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లుకు ఈ సంవత్సరంలోనే ఆమోదం లభించిందన్నారు మోదీ. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. దేశం లోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం దేశానికి గర్వకారణమన్నారు మోదీ . ‘ఎలిఫెంట్ విస్పరర్స్’కు సైతం ప్రతిష్ఠాత్మక అవార్డు రావటంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని వ్యాఖ్యానించారు. 2023లో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. క్రీడారంగంలో కూడా భారత్ రాణించిందన్నారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తాచాటారని గుర్తు చేశారు. వన్డే ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని ప్రశంసించారు.
చంద్రయాన్-3ని దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుంది ..
చంద్రయాన్-3ని దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదన్నారు మోదీ. శాస్త్రవేత్తల కృషితో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం విజయవంతమైందని.. ఇది అందరికీ గర్వకారణమని చెప్పారు. ‘ఫిట్ ఇండియా’లో భాగంగా తీసుకున్న పలు చర్యలను వెల్లడించారు. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, నటుడు అక్షయ్ కుమార్ తమ ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు.
Join in for a very special episode of #MannKiBaat as we discuss Fit India, superfoods and more! https://t.co/6SCfnQgRxa
— Narendra Modi (@narendramodi) December 31, 2023
అయోధ్యలో రామ మందిరం ప్రారంభం.. దేశం ఆత్రుతగా ఎదురు చూస్తుందన్న ప్రధాని
అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కోసం దేశం ఆత్రుతగా ఎదురు చూస్తుందన్నారు ప్రధాని . శ్రీరాముడు, అయోధ్యపై కొత్త పాటలు, భజనలు, కవితలు వస్తున్నాయన్నారు. భారత చరిత్రలో ఇది కీలక ఘట్టమన్నారు. ప్రజలు తమ సృజనాత్మకను సోషల్ మీడియాలో ‘#శ్రీరామభజన్’తో పంచుకోవాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..