Viral Video: వార‌ణాసిలో దేశీ ఫుడ్‌ ఎంజాయ్ చేసిన జపాన్ రాయ‌బారి.. భార్యతో కలిసి నెట్టింట హల్‌చల్‌

స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించాన‌ని ఈ పోస్ట్‌కు ఆయ‌న క్యాప్ష‌న్ ఇచ్చారు. క‌చోరి, స‌బ్జితో పాటు జిలేబిని ఆర‌గించిన త‌ర్వాత ఇవి అద్భుతంగా ఉన్నాయ‌నే ఫీలింగ్ క‌లిగింద‌ని వెరీ గుడ్ అంటూ రాసుకొచ్చారు. ఈ ఏడాది మేలోనూ సుజుకి వార‌ణాసి సంద‌ర్శించిన క్ర‌మంలో గోల్ గ‌ప్ప‌, బాటి చొఖ‌, వార‌ణాసి తాలిని అప్ప‌ట్లో ఆయ‌న ఎంజాయ్ చేశారు. అంతకుముందు

Viral Video: వార‌ణాసిలో దేశీ ఫుడ్‌ ఎంజాయ్ చేసిన జపాన్ రాయ‌బారి.. భార్యతో కలిసి నెట్టింట హల్‌చల్‌
Japanese Ambassador
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 31, 2023 | 9:12 PM

భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకీకి ఆహారం అంటే చాలా ఇష్టం. అతను తరచుగా సోషల్ మీడియాలో ఆహారం, పానీయాలకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తూ కనిపిస్తుంటారు. అంబాసిడర్ సుజుకీకి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అవకాశం దొరికినప్పుడల్లా ఎంజాయ్‌ చేస్తుంటారు. జపాన్ రాయబారి హిరోషి సుజుకీ మరోసారి భారతీయ వంటకాల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అది కాస్త వైరల్ గా మారింది.  ఈ వీడియోలలో అతను కచోరీ-వెజిటబుల్, జిలేబీని ఇష్టంగా తింటూ కనిపించారు. శనివారం Xలో షేర్‌ చేసిన వీడియోలో సుజుకి వారణాసిలో అత్యంత ఫేమస్‌, టేస్టీ స్ట్రీట్‌ ఫుడ్‌ ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. అతని డిన్నర్ డిష్‌లో ప్రసిద్ధ కచోరి, కూరగాయలు ఉన్నాయి. దీని తర్వాత అతను జిలేబీ కూడా తినడం కనిపించింది. వీడియోలో సుజుకా రెండు వంటకాలను ఎంతో ఆనందంతో ఆస్వాదిస్తూ కనిపించారు.

అతను రెండింటి రుచిని ఎలా ఇష్టపడ్డాడో అతను వివరించిన విధానంలో స్పష్టంగా కనిపించింది.. వార‌ణాసిలో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించాన‌ని ఈ పోస్ట్‌కు ఆయ‌న క్యాప్ష‌న్ ఇచ్చారు. క‌చోరి, స‌బ్జితో పాటు జిలేబిని ఆర‌గించిన త‌ర్వాత ఇవి అద్భుతంగా ఉన్నాయ‌నే ఫీలింగ్ క‌లిగింద‌ని వెరీ గుడ్ అంటూ రాసుకొచ్చారు. ఈ ఏడాది మేలోనూ సుజుకి వార‌ణాసి సంద‌ర్శించిన క్ర‌మంలో గోల్ గ‌ప్ప‌, బాటి చొఖ‌, వార‌ణాసి తాలిని అప్ప‌ట్లో ఆయ‌న ఎంజాయ్ చేశారు. అంతకుముందు రోజు, సుజుకి తన భార్య ఐకో సుజుకీతో కలిసి ఉన్న ఫోటోను ఎక్స్‌లో పంచుకున్నారు. వారిద్దరూ వారణాసిలో ఉన్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

దేశీ ఫుడ్ ప‌ట్ల ఆయ‌న ఎంతో ఇష్టాన్ని క‌న‌బ‌ర‌చ‌డంతో సుజుకి అన‌తికాలంలోనే సోష‌ల్ మీడియా సెన్సేష‌న్‌గా మారారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఢిల్లీలోని స‌రోజిని న‌గ‌ర్ మార్కెట్‌ను సంద‌ర్శించి షాపింగ్ చేయ‌డంతో పాటు అక్క‌డ ల‌భించే ఆలూ టిక్కీని ఇష్టంగా ఆర‌గించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..