GST: గత 9 నెలల్లో 15 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. డిసెంబర్‌లో ఎంతో తెలుసా?

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు 9 నెలల కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ.14.97 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ శాతం 12% ఎక్కువ పన్ను వసూలు వచ్చాయి. దీంతో పాటు ఈ 9 నెలల్లో నెలవారీ సగటున 1.66 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అలాగే డిసెంబర్ నెలలో రూ.1,66,882 కోట్ల పన్ను ప్రభుత్వం..

GST: గత 9 నెలల్లో 15 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. డిసెంబర్‌లో ఎంతో తెలుసా?
GST
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2024 | 6:50 PM

డిసెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.6 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు 9 నెలల కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ.14.97 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ శాతం 12% ఎక్కువ పన్ను వసూలు వచ్చాయి. దీంతో పాటు ఈ 9 నెలల్లో నెలవారీ సగటున 1.66 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అలాగే డిసెంబర్ నెలలో రూ.1,66,882 కోట్ల పన్ను ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో పన్ను వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి.

డిసెంబర్ నెల GST వసూళ్లు వివరాలు:

  • డిసెంబర్ 2023లో మొత్తం పన్ను వసూళ్లు: రూ. 1,66,882 కోట్లు
  • CGST: రూ. 30,443 కోట్లు
  • SGST: రూ. 37,935 కోట్లు
  • IGST: రూ. 84,255 కోట్లు
  • సెస్సు: రూ. 12,249 కోట్లు

కేంద్రం, రాష్ట్రాల మధ్య IGST పంపిణీ ఈ కింది విధంగా ఉంది.

ఇవి కూడా చదవండి
  • CGST: రూ. 40,057 కోట్లు
  • SGST: రూ. 33,652 కోట్లు

డిసెంబర్ నెలలో అత్యధిక GST వసూళ్లు ఉన్న రాష్ట్రాలు:

జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు రూ.8,000 కోట్లకు పైగా పన్నులు వసూలు చేశాయి.

  • మహారాష్ట్ర: రూ.26,814 కోట్లు
  • కర్ణాటక: రూ.11,759 కోట్లు
  • తమిళనాడు: రూ.9,888 కోట్లు
  • గుజరాత్: రూ.9,874 కోట్లు
  • హర్యానా: రూ. 8,130 కోట్లు
  • ఉత్తరప్రదేశ్: రూ. 8,011 కోట్లు
  • ఢిల్లీ: రూ.5,121 కోట్లు
  • పశ్చిమ బెంగాల్: రూ. 5,019 కోట్లు
  • తెలంగాణ: రూ.4,753 కోట్లు
  • ఒడిశా: రూ.4,351 కోట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!