Gold, Silver Price: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీగా తగ్గింపు!
Gold, Silver Prices: మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపినప్పుడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగితే ధరలు తగ్గే..

Today Gold, Silver Rates: మహిళలకు మంచి రోజులు వస్తున్నాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్. ఇప్పటికే బంగారం, వెండి ధరలు మండిపోతున్న తరుణంలో వినియోగదారులు సతమతమవుతున్నారు. తాజాగా మహిళలకు బంగారం ధరలు శుభవార్త అందించాయి. ధరలు భారీగా దిగి వస్తున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు వెళ్లగా, వెండి ధర రూ.4 లక్షలకు వెళ్లింది. ఇప్పుడు ఈ రెండు లోహాల ధరలు క్రమంగా వస్తున్నాయి. తాజాగా మార్చి 6వ తేదీన భారీగా దిగి వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఒక్క రోజులోనే ఏకంగా 1,750 రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపై ఒక్క రోజులోనే 1600 వరకు దిగి వచ్చింది. ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,130 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,700 వద్ద కొనసాగుతున్నాయి.
నిన్నటి ధరలను పరిశీలిస్తే 24,22 క్యారెట్ల 10 గ్రాముల ధరలు వరుసగా 1,62,880, 1,49,300 వద్ద ఉన్నాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,130 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,700 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా ఒక్క రోజులోనే భారీగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర నిన్న అంటే మార్చి 5వ తేదీన రూ.2,95,000 వద్ద ఉండగా, ఈ రోజు అంటే మార్చి 6వ తేదీన రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. అంటే ఒక్క రోజులోనే కిలోపై ఏకంగా 5000 రూపాయల వరకు దిగి వచ్చింది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపినప్పుడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగితే ధరలు తగ్గే పరిస్థితి కూడా ఉంటుంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన తర్వాత ప్రస్తుతం కొంత మేర తగ్గుదల కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మీరు బంగారం, వెండి తాజా ధరల గురించి తెలుసుకోవాలనుకుంటే 8955664433 అనే మొబైల్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
ఇది కూడా చదవండి: Government Scheme: మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్ చేసే స్కీమ్ గురించి మీకు తెలుసా?
Bank Locker Charges: మీరు బ్యాంకు లాకర్‌ను ఉపయోగిస్తున్నారా? మారనున్న ఛార్జీలు.. ఏ బ్యాంకు ఎంత?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
