AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings Account: మహిళలకు శుభవార్త! ఈ సేవింగ్స్ అకౌంట్‌తో ఫ్రీ క్రెడిట్ కార్డ్.. రూ.కోటి వరకు ప్రమాద బీమా!

ఇది ప్రత్యేకంగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పని చేసే మహిళల కోసం రూపొందించింది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటుంది. నారీ శక్తి పొదుపు ఖాతా సాధారణ ఖాతా కాదని చెప్పింది. పని చేసే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేకమైన ఆర్థిక సాధనం అని బ్యాంక్ తెలిపింది. నారీ శక్తి పొదుపు ఖాతా... మహిళలకు అందిస్తున్న అన్ని సౌకర్యాల గురించి..

Savings Account: మహిళలకు శుభవార్త! ఈ సేవింగ్స్ అకౌంట్‌తో ఫ్రీ క్రెడిట్ కార్డ్.. రూ.కోటి వరకు ప్రమాద బీమా!
Nari Shakti Savings Account
Subhash Goud
|

Updated on: Jan 01, 2024 | 7:41 PM

Share

ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నారీ శక్తి పొదుపు ఖాతా పేరుతో ప్రత్యేకమైన పొదుపు ఖాతాను ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పని చేసే మహిళల కోసం రూపొందించింది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటుంది. నారీ శక్తి పొదుపు ఖాతా సాధారణ ఖాతా కాదని చెప్పింది. పని చేసే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేకమైన ఆర్థిక సాధనం అని బ్యాంక్ తెలిపింది. నారీ శక్తి పొదుపు ఖాతా… మహిళలకు అందిస్తున్న అన్ని సౌకర్యాల గురించి వివరంగా తెలుసుకుందాం.

బీమా కవర్: నారీ శక్తి పొదుపు ఖాతా కింద మహిళల మొత్తం భద్రతే దీని తొలి ప్రాధాన్యత. ఒక కోటి రూపాయల వరకు సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఈ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య బీమాపై తగ్గింపు: నారీ శక్తి పొదుపు ఖాతా ఉన్న మహిళలు ఆరోగ్య బీమా, వెల్‌నెస్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా పొందవచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య, ఆరోగ్య బీమా పాలసీ మీకు చికిత్స ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా, వెల్నెస్ ఉత్పత్తులు మీ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడంలో మీకు సహాయపడతాయి.

లోన్ వడ్డీ రేట్లపై తగ్గింపు : నారీ శక్తి పొదుపు ఖాతా తెరిచే మహిళలు వ్యక్తిగత, గృహ, కారు రుణాల వంటి వివిధ రిటైల్ లోన్‌ల వడ్డీ రేట్లపై ప్రత్యేక రాయితీలను పొందడానికి అర్హులవుతారు. నారీ శక్తి పొదుపు ఖాతా ఉన్న మహిళలకు ఇతరులతో పోలిస్తే తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తారు. ఇది మహిళలకు క్రెడిట్‌ని పొందడాన్ని చాలా సులభం చేస్తుంది.

ప్రాసెసింగ్ రుసుములు లేవు: వడ్డీ రేట్లలో రాయితీలు కాకుండా, ఈ ఖాతాకు మరో ప్రయోజనం ఉంది. మహిళా ఖాతాదారులు రిటైల్ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది. పర్సనల్ లోన్ పరంగా, ప్రాసెసింగ్ ఫీజులు లోన్ మొత్తంలో 0.5% నుంచి 2.5% వరకు ఉంటాయి. ఈ మొత్తం.. ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటుంది.

ఉచిత క్రెడిట్ కార్డ్: నారీ శక్తి పొదుపు ఖాతా తెరిచే మహిళలు.. ఉచిత క్రెడిట్ కార్డ్ నుండీ ప్రయోజనం పొందుతారు, ఇది లావాదేవీలను చాలా సులభంగా చేస్తుంది. అదనంగా, వారి ఖాతాలో నిధులు లేకపోయినా వారు చాలా ఈజీగా లావాదేవీలు చేయగలుగుతారు.

లాకర్లపై తగ్గింపు: సాధారణంగా, మహిళల దగ్గర బంగారం, వెండి లేదా ఇతర విలువైన ఆభరణాలు ఉంటాయి. ఇంట్లో ఉంచుకుంటే పోగొట్టుకోవడం లేదా దొంగిలించే అవకాశాలు ఉన్నాయి. అందుకే బ్యాంకు లాకర్‌ తప్పనిసరి. ఈ పథకం కింద, గోల్డ్, డైమండ్ సేవింగ్స్ ఖాతాదారులు లాకర్ సౌకర్యంపై ఆకర్షణీయమైన తగ్గింపులను పొందవచ్చు, అయితే ప్లాటినం సేవింగ్ ఖాతాదారులు. అనేక సేవలను ఉచితంగా పొందవచ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి పొదుపు ఖాతా మీకు ప్రయోజనకరంగా ఉందో లేదో దాని ఫీచర్‌లు , సౌకర్యాలను బట్టి మీరే అంచనా వేయవచ్చు. నారీ శక్తి పొదుపు ఖాతా తెరవాలనుకునే మహిళలు బ్యాంక్‌లోని 5,132 బ్రాంచ్‌లలో దేనికైనా వెళ్లి ఖాతాను తెరవచ్చు. అదనంగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కింద, తెరిచే ప్రతీ ఖాతా తరపున బ్యాంక్ … CSR ఫండ్‌కు రూ. 10 విరాళంగా అందిస్తుంది. ఈ మొత్తాన్ని మహిళలు, బాలికలను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి