Gold Price Today: మళ్లీ మొదలైన పసిడి పరగు.. బుధవారం తులంపై ఎంత పెరిగిందంటే..
2024లో పసిడి ధరలు ఓ రేంజ్‌లో పెరగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70 వేల మార్క్‌ని చేరుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరగగా...
కొత్తేడాదిలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ ధరల పెరుగుదల ప్రారంభమైంది. గడిచిన మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడంతో బంగారం ప్రియులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా బంగారం ధరలో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. బుధవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలో పెరుగుదల ఉంటుందని ఇది వరకే నిపుణులు అంచనా వేశారు.
2024లో పసిడి ధరలు ఓ రేంజ్‌లో పెరగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70 వేల మార్క్‌ని చేరుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 వరకు పెరిగింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090కి చేరింది. మరి నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
దేశరాజధాని న్యూఢిల్లీలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 58,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,240గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,090గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 59,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,580గా ఉంది. కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,090గా ఉంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే బుధవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.64,090 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,090 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం బాటలోనే ప్రయణిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. బుధవారం కిలో వెండి ధర ఏకంగా ఒకేసారి రూ. 300 పెరగడం గమనార్హం. దీంతో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,900కి చేరింది. ఇక ముంబయిలో రూ. 78,900 వద్ద కొనసాగుతోంది. చెన్నై, హైదరాబాద్, కేరళల, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర అత్యధికగా రూ. 80,300కి చేరడం గమనార్హం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..