Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minimum Balance: మినిమం బ్యాలెన్స్‌ విషయంలో ఆర్‌బీఐ కీలక చర్యలు.. ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్‌ నిబంధన ఎత్తివేత

ఇటీవల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాల ద్వారా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరి అవసరంగా మారింది. అయితే భారతదేశంలో వివిధ బ్యాంకులు ఉన్నాయి. చాలా మందికి వివిధ అవసరాల నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలకు అన్ని ఖాతాలకు మినిమం బ్యాలెన్స్‌ నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మినిమం బ్యాలెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయకపోతే ఆయా బ్యాంకులు చార్జీలు మోతమోగిస్తాయి.

Minimum Balance: మినిమం బ్యాలెన్స్‌ విషయంలో ఆర్‌బీఐ కీలక చర్యలు.. ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్‌ నిబంధన ఎత్తివేత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై చర్య తీసుకోవడం ద్వారా పెట్టుబడిదారుల డబ్బును రక్షించడానికి ప్రయత్నిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నాలుగు సహకార బ్యాంకులకు జరిమానాలు విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది. ఈ 4 బ్యాంకుల్లో 3 గుజరాత్‌కు చెందినవే కావడం గమనార్హం.
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 03, 2024 | 6:35 PM

భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగం రోజురోజుక వృద్ధి చెందుతుంది. ప్రజలు తమ సొమ్మును నిల్వ చేసుకోవడానికి బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కంపెనీలు కూడా ఇచ్చే జీతాన్ని బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాల ద్వారా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరి అవసరంగా మారింది. అయితే భారతదేశంలో వివిధ బ్యాంకులు ఉన్నాయి. చాలా మందికి వివిధ అవసరాల నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలకు అన్ని ఖాతాలకు మినిమం బ్యాలెన్స్‌ నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మినిమం బ్యాలెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయకపోతే ఆయా బ్యాంకులు చార్జీలు మోతమోగిస్తాయి. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు నమోదు చేయని ఖాతాలపై కనీస నిల్వను నిర్వహించనందుకు బ్యాంకులు జరిమానా విధించలేవని ఆర్‌బీఐ ఇటీవల తెలిపింది. ముఖ్యంగాఆ స్కాలర్‌షిప్ డబ్బు లేదా డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలను స్వీకరించడం కోసం సృష్టించిన ఖాతాలను బ్యాంకులు రెండేళ్లకు పైగా ఉపయోగించకపోయినా అవి పనికిరానివిగా వర్గీకరించలేవని కూడా పేర్కొంది. ఆర్‌బీఐ తాజా నియమాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.  బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి, అలాంటి డిపాజిట్లను వారి నిజమైన యజమానులకు/క్లెయిమ్‌దారులకు తిరిగి ఇవ్వడానికి బ్యాంకులు, ఆర్‌బీఐ చేపడుతున్న కొనసాగుతున్న ప్రయత్నాలు, కార్యక్రమాలకు ఈ సూచనలు పూరిస్తాయని భావిస్తున్నారు.” ఆర్‌బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్నాయని ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌, లేఖలు లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలి. పనిచేయని ఖాతా యజమాని స్పందించని పక్షంలో ఖాతాదారుని పరిచయం చేసిన వ్యక్తి లేదా ఖాతాదారుని నామినీలను సంప్రదించాల్సిందిగా బ్యాంకులను కోరింది.

అలాగే ఆపరేటివ్ ఖాతాగా వర్గీకరించిన ఏదైనా ఖాతాలో కనీస నిల్వలను నిర్వహించనందుకు బ్యాంకులు జరిమానా ఛార్జీలు విధించడానికి అనుమతించబడవు. పని చేయని ఖాతాలను సక్రియం చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించకూడదని ఆ సర్వ్యూలర్‌ అని నియమాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆర్‌బీఐ నివేదిక ప్రకారం అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లు 2023 మార్చి చివరి నాటికి రూ.32,934 కోట్ల నుంచి 28 శాతానికి పెరిగి రూ.42,272 కోట్లకు చేరాయి. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆపరేట్ చేయని డిపాజిట్ ఖాతాలలోని ఏదైనా బ్యాలెన్స్‌ను బ్యాంకులు ఆర్‌బిఐ నిర్వహించే డిపాజిటర్, ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది.  మినిమమ్ బ్యాలెన్స్‌లు నిర్వహించనందుకు పెనాల్టీ ఛార్జీలు విధించినందున ఖాతాల్లో నిల్వలు ప్రతికూలంగా మారకుండా చూసుకోవాలని ఆర్‌బిఐ గతంలో బ్యాంకులను ఆదేశించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి