Telangana: కొడుకు గుండెపోటుతో మరణం.. వార్త విన్న తల్లి మృతి.. కుటుంబంలో తీవ్ర విషాదం..
తన కళ్ళ ముందు కొడుకుకి గుండెపోటు వచ్చి మరణించడంతో, ఆ బాధను తట్టుకోలేక తల్లి కూడా గుండెపోటుతో చనిపోయింది.. తల్లి, కొడుకు ఒకే రోజు గుండెపోటుతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.. మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ మండలం కుచన్ పల్లి గ్రామంలో తల్లి, కొడుకు గుండెనొప్పితో మృతి చెందారు.. కుచన్ పల్లి గ్రామానికి చెందిన వీరప్ప గారి నర్సా గౌడ్ వయసు(39) సంవత్సరాలు..

కరోనా వెలుగులోకి వచ్చిన తరవాత వయసుతో సంబధం లేకుండా అనేక మంది అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న, పెద్ద మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా తల్లి, కొడుకు ఏకకాలంలో గుండెపోటుతో మరణించడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన కళ్ళ ముందు కొడుకుకి గుండెపోటు వచ్చి మరణించడంతో, ఆ బాధను తట్టుకోలేక తల్లి కూడా గుండెపోటుతో చనిపోయింది.. తల్లి, కొడుకు ఒకే రోజు గుండెపోటుతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి..వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ మండలం కుచన్ పల్లి గ్రామంలో తల్లి, కొడుకు గుండెనొప్పితో మృతి చెందారు.. కుచన్ పల్లి గ్రామానికి చెందిన వీరప్ప గారి నర్సా గౌడ్ వయసు(39) సంవత్సరాలు.. ఇతని వృత్తి ఆటో డ్రైవర్ ఆటో నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఉదయము నాలుగు గంటలకు చాతిలో నొప్పి వస్తుందని తన భార్యతో చెప్పగా.. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కొడుకు మరణించిన విషయం తెలుసుకొని బాధను భరించలేకపోవడంతో ఆమెకు గుండెపోటు వచ్చి మృతి చెందింది. మృతుడు తల్లి బీరప్ప లక్ష్మి వయసు(62) సంవత్సరాలు.
నర్సా గౌడ్ భార్య లత(35).. కూతురు ప్రసన్న(15) 9 తరగతి చదువుతుంది. కొడుకు కార్తీక్ గౌడ్(12)7 ఏడవ తరగతి చదువుతున్నాడు. తల్లి, కొడుకు ఓకే రోజు గుండెపోటుతో చనిపోవడంతో కుచన్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..